సాఫ్ట్ వేర్ కంపెనీ లేడీస్ బాత్రూమ్ లో వీడియోలు తీసి వెబ్ సైట్ లో: మహిళలు చూసి!
బెంగళూరు: కంపెనీ నిర్వహకుల కళ్లు గప్పి మహిళల బాత్రూమ్ లోకి ప్రవేశించి రహస్యంగా కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలు తీసి వెబ్ సైట్ లలో పెడుతున్న కామాంధుడిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కామాంధుడి దగ్గర ఉన్న మొబైల్ లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.

ఉద్యోగం కోసం వచ్చి !
ఉత్తరప్రదేశ్ కు చెందిన ధర్మేంద్ర కుమార్ యాదవ్ బెంగళూరు నగరం చేరుకుని ఇందిరానగర్ ప్రాంతంలో ఉన్న ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో రెండేళ్లుగా హౌస్ కీపింగ్ పనిచేస్తున్నాడు. హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్న ధర్మేంద్ర కుమార్ ప్రతీరోజూ బాత్రూమ్ లు శుభ్రం చేస్తున్నాడు.

రహస్య కెమెరాలు
ప్రతిరోజూ లేడీస్ బాత్రూమ్ లు శుభ్రం చేస్తున్న ధర్మేంద్ర కుమార్ యాదవ్ అక్కడ రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి మహిళలు అర్ధనగ్నంగా ఉన్న వీడియోలను చిత్రీకరించి వాటిని వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు.

లేడీ లెక్కీకి అనుమానం !
సాఫ్ట్ వేర్ కంపెనీలోని ఓ మహిళా ఉద్యోగిని బాత్రూమ్ కు వెళ్లిన సమయంలో ధర్మేంద్ర కుమార్ యాదవ్ రహస్యంగా తన మొబైల్ ఫోన్ కెమెరాతో వీడియో, ఫోటోలు తీస్తుండటం ఆమె గమనించింది. సాఫ్ట్ వేర్ కంపెనీలోని మహిళా ఉద్యోగినులు అందరూ కలిసి ధర్మేంద్ర కుమార్ యాదవ్ ను పట్టుకొని దేహశుద్ధి చేసి అతన్ని పోలీసులకు అప్పగించారు.

రెండేళ్లుగా అదే పని !
ఇందిరానగర్ పోలీసులు ధర్మేంద్ర కుమార్ యాదవ్ దగ్గర ఉన్న ఫోన్, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ధర్మేంద్ర కుమార్ యాదవ్ ను విచారించగా తాను మహిళలు బాత్రూమ్ ల్లో వారు అర్దనగ్నంగా ఉన్న వీడియోలు తీశానని అంగీకరించాడని పోలీసులు చెప్పారు.

మహిళల ఆందోళన
ధర్మేంద్ర కుమార్ యాదవ్ పని చేస్తున్న సాఫ్ట్ వేర్ కంపెనీలో చాల మంది మహిళలు, యువతులు ఉద్యోగం చేస్తున్నారు. అర్దనగ్నంగా ఉన్న సమయంలో మా ఫోటోలు, వీడియోలు తీసి ఎన్ని వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశాడో అంటూ మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఆ కంపెనీలో లేడీస్ బాత్రూమ్ లు శుభ్రం చెయ్యడానికి మహిళలను ఎందుకు నియమించలేదని ఉద్యోగినిలు యాజమాన్యాన్ని నిలదీశారు.












Click it and Unblock the Notifications