వదినతో వన్స్ మోర్, చిన్నానకు సీటీమార్ చెప్పిన ఆంటీ కొడుకు, మ్యాటర్ ఫినిష్ !
చెన్నై/విల్లుపురం/వేలూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో ముగ్గురు పిల్లలు పుట్టారు. భర్త అనారోగ్యంతో చనిపోయాడు. భర్త తమ్ముడికి పెళ్లి అయ్యింది. భర్తతో గొడవపడిన మహిళ ఆమె పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త చనిపోయిన వదినతో భార్యను వదిలేసి వెళ్లిపోయిన మరిది అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశాడు. వదినతో వన్స్ మోర్ అంటున్న మరిదిని అతని అన్న కొడుకు సీటీమార్ అంటూ చంపేశాడు.
తమిళనాడులోని విల్లుపురంలోని సర్కిల్ తేప్రంట్టం ప్రాంతంలో రమేష్, సురేష్ అనే అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. 20 ఏళ్ల క్రితం అన్న రమేష్ అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న పద్మావతి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. రమేష్, పద్మావతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.

15 ఏళ్ల క్రితం సురేష్ కు సౌందర్య అనే మహిళతో వివాహం అయ్యింది. సురేష్ కు కూడా ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. 7 ఏళ్ల క్రితం అనారోగ్యంతో రమేష్ చనిపోయాడు. భర్త రమేష్ చనిపోవడంతో పద్మావతి ఆమె కుమారులు, కుమార్తెతో కలిసి వేరుగా నివాసం ఉంటున్నది. నాలుగు సంవత్సరాల క్రితం సురేష్ తో గొడవపడిన అతని భార్య సౌందర్య ఆమె పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.
భార్య సౌందర్య పుట్టింటికి వెళ్లిపోవడంతో సురేష్ ఒంటరిగా ఉంటున్నాడు. అన్న రమేష్ చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తున్న వదిన పద్మావతిని సురేష్ లైన్ లో పెట్టాడు. భర్త చనిపోవడంతో విరహంతో ఉన్న వదిన పద్మావతి, భార్య సౌందర్య దూరం కావడంతో ఒంటరిగా ఉన్న సురేష్ అక్రమ సంబంధం పెట్టుకున్నారు.

పద్మావతి పెద్ద కుమారుడు చెన్నైలో పనిచేస్తూ మూడు నెలలకు ఒకసారి ఇంటికి వెళ్లి వస్తున్నాడు. వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్న మరిదితో పద్మావతి వన్స్ మోర్ అంటూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తోంది. తల్లి అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న పద్మావతి పెద్ద కుమారుడు చెన్నైలోని ఉండిపోయి ఇంటికి రావడం మానేశాడు.
కొడుకు దూరం కావడంతో పద్మావతి కలత చెంది మరిదితో అక్రమ సంబంధానికి గుడ్ బై చెప్పాలని అనుకుంది. అయితే వదిన పద్మావతిని వదులుకోవడానికి ససేమిరా అంటున్న సురేష్ మాత్రం ఆమెను బలవంతంగా లొంగదీసుకుని లైంగిక దాడి చెయ్యడం మొదలుపెట్టాడు. అయితే మరిది సురేష్ ను దూరం పెట్టాలని కొంతకాలంగా పద్మావతి అనేక ప్రయత్నాలు చేసిందని తెలిసింది.
మా ఇంటికి రాకూడదని పద్మావతి రెండో కొడుకు కూడా అతని చిన్నాన సురేష్ కు గట్టిగా చెప్పినా అతను ఏమాత్రం పట్టించుకోలేదని తెలిసింది. రాత్రి పీకలదాక మద్యం సేవించిన సురేష్ అతని వదిన ఇంటికి వెళ్లి ఆమెను బెడ్ రూమ్ లోకి లాక్కొని వెళ్లి ఆమె మీద లైంగిక దాడి చేశాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన పద్మావతి కేకలు వేసింది.

పక్కరూమ్ లో ఉన్న పద్మావతి రెండు కొడుకు వెళ్లి తలుపులు తియ్యాలని చెప్పాడు. తరువాత పద్మావతి, ఆమె కొడుకు కలిసి ఇంట్లో ఉన్న కొన్ని కొబ్బరికాయలు తీసుకుని సురేష్ తల మీద ఇష్టం వచ్చినట్లు దాడి చెయ్యడంతో మద్యం మత్తులో అతను కప్పకూలిపోయాడు. తరువాత పద్మావతి, ఆమె కుమారుడు కలిసి సురేష్ ను విల్లుపురం ఆసుపత్రికి తరలించారు,
మద్యం మత్తులో సురేష్ మేడ మీద మెట్ట మీద నుంచి జారి కిందకు పడిపోయాడని పద్మావతి వైద్యులకు చెప్పింది. అక్కడ ప్రథమ చికిత్స చేసిన తరువాత సురేష్ ను వేలూరు మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులకు అనుమానం వచ్చి సురేష్ గురించి పోలీసుకు సమాచారం అందించారు.
అయితే ఇన్ని రోజులు చికిత్స పొందిన సురేష్ చనిపోయాడు. విషయం తెలసుకున్న పోలీసులు పద్మావతిని అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా అక్రమ సంబంధం మానుకోవాలని చెప్పినా సురేష్ పట్టించుకోలేదని, అందుకే తల మీద కొబ్బరి కాయలతో దాడి చేసి చంపేశామని అంగీకరించిందని పోలీసులు అన్నారు. పద్మావతి, ఆమె కొడుకును అరెస్టు చేశామని విల్లుపురం పోలీసులు తెలిపారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications