ప్రియుడి మోజులో.. : కన్న కూతురని కూడా చూడకుండా..!
బెంగళూరు : వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ప్రియుడి మోజులో పడి భర్తను, కన్న బిడ్డలను చంపడానికి కూడా వెనుకాడడం లేదు కొంతమంది మహిళలు. తాజాగా బెంగుళూరుకి చెందిన ఓ మహిళ తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందన్న కారణంతో కన్న కూతురునే హత్య చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని పీన్యాలో ఉన్న ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పశ్చిమ బెంగాల్ కు చెందిన రేఖా మండల్ అనే వివాహిత పనిచేస్తోంది. అయితే ఐదేళ్ల క్రితమే భర్త నుంచి విడిపోయిన రేఖా, తను పనిచేసే ఫ్యాక్టరీలోనే బియ్యుత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త నుంచి విడిపోయే నాటికే రేఖా మండల్ కు ఓ కూతురు ఉండగా ప్రస్తుతం ఆ బాలిక వయస్సు 8 ఏళ్లు.

కాగా, రేఖా బియ్యుత్ ఇద్దరు కలిసి కొంతకాలంగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే తమ వివాహేతర సంబంధానికి కూతరు అడ్డంకిగా మారిందని భావించిన రేఖా తరచూ పాపను తీవ్రంగా కొట్టేదని తెలుస్తోంది. ఇదే క్రమంలో రెండు రోజుల క్రితం డాడీ గురించి చెప్పాలంటూ పాప తల్లి రేఖాను అడగ్గా.. ప్రియుడు బియ్యుత్ తో కలిసి చిన్నారిని తీవ్రంగా కొట్టింది రేఖా.
ఇద్దరూ కలిసి కొట్టడంతో చిన్నారి తలకు తీవ్ర గాయమైంది. అయితే కనికరం లేని ఆ తల్లి చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడంతో పాప చనిపోయింది. విషయం కాస్త ఆ నోటా.. ఈ నోటా.. పోలీసుల దృష్టికి రావడంతో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications