Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూట్యూబ్ పాట మహిళ ప్రాణం తీసిందా, భర్త, పిల్లలు ఏం చేశారు, ఫ్రెండ్ కోసం !

బెంగళూరు: యూట్యూబ్ పాటల పిచ్చితో యాప్ లో పాట పోస్టు చెయ్యడానికి ఫ్రెండ్ తనతో కలిసి పాట పాడలేదని మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు గ్రామీణ జిల్లా శివార్లలోని చిక్కబళ్లాపుర పట్టణంలో జరిగింది. కేవలం స్నేహితుడు పాట పాడలేదని, ఆ పాట యూట్యూబ్ లో పోస్టు చెయ్యలేదని ఆ ఇల్లాలు ఆత్మహత్య చేసుకుంది. భర్త, పిల్లలు ఏం చేశారని ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది అనే అనుమానం ఇప్పుడు తెర మీదకు వచ్చింది. మహిళ ఆత్మహత్య చేసుకున్నా ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యలేదని పోలీసులు అంటున్నారు.

యూట్యూబ్ పాటలు

యూట్యూబ్ పాటలు

చిక్కబళ్లాపురంలోని 16వ వార్డులోని గర్ల్స్ స్కూల్ వెనుక భాగంలో శిల్ప అనే మహిళ నివాసం ఉంటున్నది. శిల్పకు వివాహం అయ్యి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోషల్ మీడియాలో స్మైల్ అనే యాప్ క్రియేట్ చేసిన శిల్ప పాటలు పాడి అందులో పోస్టు చెయ్యడం, యూట్యూబ్ లో పాటలు పాడటం అలవాటుగా పెట్టుకుంది. ఈ విషయంలో శిల్పకు ఆమె భర్త ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని సమాచారం.

సింగర్ కావాలని !

సింగర్ కావాలని !

శిల్పకు సోషల్ మీడియా ఓ పిచ్చిగా మారినంత పని అయ్యింది. నిత్యం సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో శిల్ప పాడిన పాటలు పెట్టి సరదా తీర్చుకునేది. శిల్పకు ఆ సరదా కాస్త పిచ్చిగా తయారైయ్యింది. సోషల్ మీడియా ద్యాస తప్ప వేరే ద్యాస లేక శిల్ప చాలకాలం నుంచి సతమతం అయ్యి కుటుంబ సభ్యులకు దూరం అవుతూ వచ్చింది.

ఫ్రెండ్ దేవరాజ్

ఫ్రెండ్ దేవరాజ్

చిక్కబళ్లాపురంలోనే నివాసం ఉంటున్న శిల్పకు హాసన్ కు చెందిన దేవరాజ్ అనే వ్యక్తి శిల్పతో కలిసి యుగళ గీతాలు పాడవారు. ఆ మాటలను సోషల్ మీడియాలో పెట్టడం కొంత కాలంగా జరిగింది. శిల్ప, దేవరాజ్ పాడే పాటలు చాల వరకూ యూట్యూబ్ లో దర్శనం ఇచ్చాయి. గత కొన్ని నెలల నుంచి శిల్ప, దేవరాజ్ యుగళ గీతాలు పాడి ఆ పాటలను యూట్యూబ్ లో పెడుతున్నారు.

అమావాస్య పూజల కోసం భర్త, పిల్లలు

అమావాస్య పూజల కోసం భర్త, పిల్లలు

శుక్రవారం శిల్ప భర్త, పిల్లలు బంగారుపేటలోని ఆలయంలో అమావాస్య పూజలు చెయ్యడానికి వెళ్లారు. అదే సమయంలో తనతో పాటలు పాడటానికి చిక్కబళ్లాపురంలోని తన ఇంటికి రావాలని శిల్ప హాసన్ లోని దేవరాజ్ కు చెప్పింది. అయితే దేవరాజ్ ఆ రోజు పాటలు పాడటానికి నిరాకరించాడు.

దూరం పెట్టిన దేవరాజ్

దూరం పెట్టిన దేవరాజ్

పాటలు పాడటానికి దేవరాజ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పాట పాడటానికి దేవరాజ్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. శుక్రవారం అర్దరాత్రి శిల్ప ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టిన తరువాత దేవరాజ్ కు ఫోన్ చేసింది. అయితే దేవరాజ్ ఫోన్ రిసీవ్ చెయ్యలేదు. ఈ విషయంలో విరక్తి చెందిన శిల్ప ఇంటిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కేసు పెట్టని కుటుంబ సభ్యులు

కేసు పెట్టని కుటుంబ సభ్యులు

ఎంత సేపు ఫోన్ చేసినా భార్య శిల్ప నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె భర్త ఇంటి యజమానికి సమాచారం ఇచ్చాడు. ఇంటి యజమాని కిటికిలో నుంచి చూడగా శిల్ప ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. శిల్ప కుటుంబ సభ్యులు మాత్రం ఎలాంటి కేసు పెట్టలేదని చిక్కబళ్లాపురం జిల్లా ఎస్పీ కే. సంతోష్ కుమార్ అన్నారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని జిల్లా ఎస్పీ సంతోష్ కుమార్ వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+