Wife: భార్య ప్లాన్ ఏ, భర్త ప్లాన్ బి, ప్రియుడు ప్లాన్ సీ, ఉద్యోగానికి వెలుతున్న భార్య, ప్రియుడితో ?, ఒకరు ఔట్
చెన్నై/ తిరువణ్ణామలై: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేస్తోంది. ఉద్యోగం చేస్తున్న మహిళకు ఆమె పని చేస్తున్న చోటే ఉద్యోగం చేస్తున్న యువకుడు పరిచయం అయ్యాడు. రానురాను ఇద్దరూ చనువు పెంచుకున్నారు. తరువాత అక్రమ సంబంధం పెట్టుకుని సీక్రేట్ గా బయట తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ఇంటికి వెళ్లిన తరువాత కూడా బెడ్ రూమ్ లో ఉండిపోతున్న భార్య ఆమె ప్రియుడితో గంటలు గంటలు మాట్లాడటం మొదలుపెట్టింది. భర్తకు మ్యాటర్ తెలిసిపోయింది. భార్యను ఓ రైంజ్ లో బెండ్ తీసిన భర్త ఇంకోసారి ఇలా జరిగితే చంపేస్తానని హెచ్చరించాడు. ప్రియురాలి భర్త, ప్రియుడు లిక్కర్ పార్టీకి వెళ్లారు. అక్కడే ఒకరు పైలోకాలకు వెళ్లిపోయాడు.

పిల్లల తల్లి
తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని అరణి సమీపంలోకి కడుక్కనూర్ గ్రామంలో లక్మీకాంతం అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం రాజేశ్వరి అనే మహిళను లక్ష్మీకాంతం వివాహం చేసుకున్నాడు. లక్ష్మీకాంతంను వివాహం చేసుకున్న రాజేశ్వరి ఆమె భర్తతో చక్కగా కాపురం చేసింది. లక్ష్మీకాంతం, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య
సెయ్యర్ ప్రాంతంలోని సిఫ్ కాట్ ఇండస్ట్రియల్ ఏరియాలో రాజేశ్వరి ఉద్యోగం చేస్తోంది. రాజేశ్వరి పని చేస్తున్న చోటే ఉద్యోగం చేస్తున్న ఉదయ్ సూర్యన్ అనే యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు. ప్రతిరోజు ఒకేచోట పని చేస్తున్న రాజేశ్వరి, ఉదయ్ సూర్యన్ రానురాను ఇద్దరూ చనువు పెంచుకున్నారు. తరువాత రాజేశ్వరితో ఉదయ్ సూర్యన్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

ఉద్యోగానికి నామం.... భార్య ప్లాన్ -ఏ
ఉద్యోగానికి వెలుతున్నానని భర్త లక్ష్మీకాంతంకు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతున్న రాజేశ్వరిలో నెలలో కొన్ని రోజులు సెలవు పెట్టి ప్రియుడు ఉదయ్ సూర్యన్ తో కలిసి తిరుగుతూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. అయితే జీతం మాత్రం రాజేశ్వరి కరెక్ట్ గా ఆమె భర్త లక్ష్మీకాంతంకు ఇచ్చేస్తుంది. రాజేశ్వరికి అవసరమైన డబ్బు ఆమె ప్రియుడు ఉదయ్ సూర్యన్ ఇస్తున్నాడు.

భర్తకు మ్యాటర్ లీక్ అయ్యింది
రాజేశ్వరి ఆమె ప్రియుడు ఉదయ్ సూర్యన్ తో సీక్రేట్ గా బయట తిరుగుతూ ఎంజాయ్ చేసింది. సాయంత్రం ఇంటికి వెళ్లిన తరువాత కూడా రాజేశ్వరి ఆమె కూతుర్లను చదువుకోమని చెప్పి ఆమె మాత్రం బెడ్ రూమ్ లోకి వెళ్లి ఆమె ప్రియుడు ఉదయ్ సూర్యన్ తో గంటలు గంటలు మాట్లాడటం మొదలుపెట్టింది. రాజేశ్వరి అక్రమ సంబంధం మ్యాటర్ ఆమె భర్త లక్మీకాంతంకు తెలిసిపోయింది.

భార్యను బెండ్ తీసిన భర్త.... ప్లాన్- బి
భార్య రాజేశ్వరిని చితకబాదిన లక్ష్మీకాంతం ఇంకోసారి ఉదయ్ సూర్యన్ తో తిరిగితే నిన్ను, వాడిని చంపేస్తానని హెచ్చరించాడు. కొన్ని రోజులు రాజేశ్వరి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చేశాడు. తన భర్త లక్ష్మీకాంతంకు మ్యాటర్ తెలిసిపోయిందని, నేను బయటకు రాలేనని రాజేశ్వరి ఆమె ప్రియుడు ఉదయ్ సూర్యన్ కు ఫోన్ చేసి చెప్పింది.

బావిలో శవమైన భర్త
డిసెంబర్ 23న ఇంటి నుంచి బయటకు వెళ్లిన లక్ష్మీకాంతం తరువాత తిరిగి ఇంటికి రాలేదు. డిసెంబరు 24న లక్ష్మీకాంతం ఆ ప్రాంతంలోని ఓ రైతు బావిలో శవమై కనిపించాడు. ఈ ఘటనపై రెవెన్యూ అధికారి రమేష్ పెరనమల్లూరు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లక్ష్మీకాంతం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.

ప్రియుడు ప్లాన్ సీ లిక్కర్ పార్టీ
లక్ష్మీకాంతం కేసులో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజేశ్వరిపై పోలీసులు నిఘా వేశారు. విచారణలో పలు షాకింగ్ సమాచారం వెలుగు చూశాయి. రాజేశ్వరి, ఉదయ్ సూర్యన్ అక్రమ సంబంధం వెలుగు చూసింది. వెంబక్కం గ్రామానికి చెందిన ఉదయ్ సూర్యన్, అతని బంధువు పాండియన్ (23) కలిసి డిసెంబర్ 23వ తేదీన రాత్రి నీతో మాట్లాడాలని రాజేశ్వరి భర్త లక్ష్మీకాంత్‌కు ఫోన్ చేసి చెప్పారు. అదే రోజు రాత్రి లక్ష్మీకాంతం, ఉదయ్ సూర్యన్, పాండియన్ కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉదయ్ సూర్యన్, పాండియన్ ఇద్దరూ కలిలిసి లక్ష్మీకాంతంను గొంతు నులిమి హత్య చేసి శవాన్ని తీసుకెళ్లి వినాయగం అనే వ్యక్తి వ్యవసాయ బావిలో విసిరేశారని పోలీసులు అన్నారు. భర్త లక్ష్మీకాంతంను హత్య చేయించిన రాజేశ్వరి, ప్రియుడు ఉదయ్ సూర్యన్, పాండియన్ వేరేఊరికి పారిపోతున్న సమయంలో అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications