Mobile Crematorium: సంచార దహన వాటిక.. ఎక్కడంటే..
ప్రతి మనిషి జీవితంలో చావు, పుట్టుక సహజం. పుట్టిన ప్రతి మనిషి చావడం ఖాయం. అయితే చనిపోయిన వ్యక్తి గౌరవప్రదంగా వీడ్కోలు పలకడం అందరి బాధ్యత. అయితే ప్రస్తుతం చనిపోయిన తర్వాత చేసే దహనసంస్కారాల ఖర్చు పెరిగిపోయింది. దీంతో నిరుపేదలు దహనసంస్కారాలు చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి కోసం సంచార దహన వాటికను తయారు చేయించింది కర్ణాటకలోని వ్యవసాయ సహకార సమితి.

కరోనా సమయంలో
కర్ణాటకలోని తీర ప్రాంత జిల్లాల్లోని చాలా గ్రామాల్లో ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఓ గ్రామంలో ఒక వ్యక్తి చనిపోతే పెరట్లోనే దహన సంస్కారాన్ని నిర్వహించాల్సి వచ్చిందట. అందుకే బైందూరు నియోజకవర్గంలోని ముడూరు వ్యవసాయ సహకార సమితి సభ్యులు బాగా ఆలోచించి.. ఏదైనా చేయాలని భావించారు.

రూ. 5.8 లక్షలు
అందులో భాగంగా రూ. 5.8 లక్షలతో కొత్త పరికరాన్ని తయారు చేయించారు. దానికి 'సంచార శ్మశానం'గా నామకరణం చేశారు. రవాణా, దహన సంస్కారానికి అయ్యే ఖర్చును ముడూరు వ్యవసాయ సహకార సమితే భరిస్తోంది. దీంతో పేదవారి కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే వారికి ఈ పరికారంలోనే దహనసంస్కారాలు నిర్వహిస్తున్నారు.

10 కిలోల గ్యాస్
ఈ పరికరం 7 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తు ఉండగా.. ఈ పరికరాన్ని పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. శవాన్ని దహనం చేసే సమయంలో ఎవరికీ కనపడకుండా పైన ఒక డోమ్‌ను అమర్చవచ్చు. ఈ పరికరం విద్యుత్తు, గ్యాస్ రెండింటితోనూ పని చేస్తుంది. ఒక డెడ్ బాడీని దహనం చేసేందుకు 10 కిలోల గ్యాస్, 100 గ్రాముల కర్పూరం అవసరమవుతుందని వ్యవసాయ సహకార సమితి అధ్యక్షులు విజయశాస్త్రి చెప్పారు.












Click it and Unblock the Notifications