mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ప్రభుత్వం ఆదుకోవడంతో మహిళకు అంగన్ వాడి కేంద్రంలో ఉద్యోగం వచ్చింది. అయితే తల్లీ కూతురు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ హడలిపోయారు.
చెన్నై/ విరూద్ నగర్: తమిళనాడులోని విరూద్ నగర్ జిల్లాలోని శివకాశి రిజర్వ్ లైన్ ప్రాంతంలో సాలముత్తు, పాండిదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. దంపతులకు మహారాజన్ అనే కుమారుడు, భువనేశ్వరి అనే కుమార్తె ఉన్నారు. మహారాజన్ మానసిక వికలాంగుడు, వికలాంగుడు కావడంతో దంపతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారని చెబుతున్నారు. పాండిదేవి భర్త సాలముత్తు కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో పాఠశాలలో చదువుతున్న వికలాంగుడైన కొడుకు, కూతురిని కాపాడేందుకు పాండిదేవి నానా అవస్థలు పడి ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.
గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ విరుదునగర్‌లోని ప్రచారం చేసే సమయంలో ఆకార్యక్రమానికి వికలాంగుడైన కొడుకుతో కలిసి పాండిదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నేత ఎం.కె.స్టాలిన్ కూడా తగిన సాహాయం చేస్తామని పాండిదేవికి హామీ ఇచ్చారు. అనంతరం డీఎంకే తరపున 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పాండిదేవి చితురాజపురం ప్రాంతంలో అంగన్‌వాడీ టీచర్‌గా నియమితులయ్యారు.

ఈ క్రమంలో గతేడాది ఫిబ్రవరి 3వ తేదీన వికలాంగుడైన కుమారుడు మృతి చెందాడు. భర్త, కొడుకు చనిపోవడంతో పాండిదేవి తీవ్ర వేదనకు గురైందని చెబుతున్నారు. కాగా నిన్న శుక్రవారం పాండిదేవి కుమారుడు మహారాజన్ చనిపోయిన రోజు. కొడుకు సమాధి దగ్గర పూజలు చేసిన పాండిదేవి ఆమో కూతురు భవనేశ్వరి ఇంటికి వెళ్లారు. తరువాత పాండిదేవి, ఆమె కూతురు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. .
శనివారం ఎంతసేపు అయినా పాండిదేవి తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం శివకాశి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే శివకాశి నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు మృతి చెందిన రోజునే తల్లీ, కూతురు ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ ప్రాంతంలో విషాదచాయలు నెలకొన్నాయి.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications