నంద్యాలలో భర్తను వదిలేసింది, ఇక్కడ రెండో పెళ్లి చేసుకుంది, ఒకే ఇంట్లో మూడు శవాలు!
భర్తను వదిలేసి పుట్టింటిలో ఉంటున్న మహిళ రెండేళ్ల క్రితం వేరే మతం వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకున్నా ఆమె మాత్రం హిందూ సంప్రాదాయం ప్రకారం కాపురం చేస్తోంది. హిందూమతం మారకుండా కుటుంబాన్ని నడుపుతున్న మహిళ, ఆమె తల్లి, ఐదు ఏళ్ల కొడుకు వారి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ముగ్గురూ ఒకేసారి శవమై కనిపించడం కలకలం రేపింది.
ఈ ఘటన కర్ణాటకలోని కొప్పల జిల్లా హోసలింగపుర గ్రామంలో చోటుచేసుకుంది. ఇంట్లో మూడు మృతదేహాలు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఉలిక్కిపడ్డారు. మృతులను తల్లి రాజేశ్వరి (50), కూతురు వసంత (28), మనవడు సాయి ధర్మతేజ (5) అని కోప్పళ జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. ఈ ముగ్గురి మృతికి సరైన కారణాలు తెలియరాలేదని, పూర్తి సమాచారం సేకరిస్తున్నామని మునీరాబాద్ పోలీసు అధికారులు తెలిపారు.

అంతేకాకుండా ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి విచారణ జరుపుతోంది.మృతురాలు వసంత అనే మహిళకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలకు చెందిన ఓ వ్యక్తితో ఏడు సంవత్సరాల క్రితం వివాహమైంది. భర్తతో కాపురం చేసిన వసంతకు సాయి ధర్మతేజ అనే కుమారుడు పుట్టాడు. అయితే కుటంబ గొడవల కారణంగా రెండేళ్ల క్రితం వసంత నంద్యాలలో భర్తను విడిచిపెట్టి కోప్పల జిల్లాలోని తల్లి స్వగ్రామమైన లింగాపూర్ కు చేరుకుని అక్కడే స్థిరపడింది.
కొంతకాలం క్రితం వసంత వేరే మతం వ్యక్తిని వివాహం చేసుకుందని తెలిసింది. భర్తతో కాపురం చేస్తూ తల్లీ, కుమారుడితో కలిసి ఉంటున్న వసంత బాగానే ఉందని తెలిసింది. అయితే హఠాత్తుగా ఇంట్లో ముగ్గురు చనిపోయారు. కొందరు వ్యక్తులు ముగ్గురిని హత్య చేసి పరారైనట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.
మరో కూతురు వసంత తల్లి రాజేశ్వరికి ఫోన్ చేసింది. కానీ ఫోన్ రిసీవ్ చెయ్యలేదు. అలాగే ఒక్కరోజు పూర్తి అయినా వసంత ఇంటి తలుపులు తీయ్యకపోవడంతో స్థానికులకు కూడా అనుమానం వచ్చింది.
దీంతో అనుమానం వచ్చి మంగళవవారం ఉదయం వెళ్లి ఇంటిలో పరిశీలించగా ముగ్గురూ మృతి చెందిన సమాచారం బయటకు వచ్చింది. బెడ్ రూమ్ లో అమ్మమ్మ, మనవడి మృతదేహాలు లభ్యమయ్యాయి. వంటగదిలో వసంత మృతదేహం లభ్యమైందని పోలీసు అధికారులు తెలిపారు. అయితే ముగ్గురి మృతికి గల ఖచ్చితమైన కారణం తెలియరాలేదని పోలీసులు తెలిపారు. వీరిది సహజ మరణమా లేక హత్యా అనేది తెలియరాలేదు.
చిన్న వయస్సులోనే ఉన్నందున తన జీవితానికి భర్త ఉండాలనే ఉద్దేశ్యంతో వేరే మతానికి చెందిన వ్యక్తిని వసంత పెళ్లి చేసుకుంది. కానీ ఇలా అందరూ ఒకేసారి శవాలు అవుతారని ఎవ్వరూ ఊహించలేదని పోలీసు అధికారులు అంటున్నారు. ఇక వసంతను పెళ్లి చేసుకున్న వ్యక్తి కనపడకపోవడంతో అతని కోసం గాలిస్తున్నామని, చుట్టుపక్కల వారి నుంచి వివరాలు సేకరిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications