డైరెక్ట్ గా బెడ్ రూమ్ లోకి వస్తున్న ప్రియుడు, కూతురితోనే సమస్య, తల్లి మాత్రం !
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న కూతురిని ఆమె తల్లి హత్య చేసిన ఘటన కర్ణాటకలోని ధారవాడ నగరంలోని కమలాపూర్ లోని హుగర ఓణిలో చోటుచేసుకుంది. తల్లి జ్యోతి, ఆమె ప్రియుడు రాహుల్ కలిసి మైనర్ అమ్మాయిని గొంతు కోసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హుబ్బళిలోని నవనగర్‌కు చెందిన రాహుల్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న జ్యోతి భర్తను నిర్లక్షం చేసింది.
కొంతకాలం క్రితం భర్తకు దూరం అయిన జ్యోతి ఆమె కూతురితో కలిసి వేరుగా నివాసం ఉంటున్నది. ఇంట్లో కూతురు మాత్రమే ఉండటం, అడిగేవాళ్లు కరువు కావడంతో జ్యోతి ఆడింది ఆటగా పాడిందిపాటగా తయారైయ్యింది. ప్రియుడు రాహుల్ ను నేరుగా ఇంటికే పిలిపించుకుంటున్న జ్యోతి అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తోంది. అయితే నిత్యం మన ఇంటికి రాహుల్ ఎందుకు వస్తున్నాడని కూతురు తల్లి జ్యోతిని ప్రశ్నించింది.

కొంతకాలం కూతురికి ఏదో ఒకరకంగా మాయమాటలు చెబుతూ వచ్చిన జ్యోతి ప్రియుడ రాహుల్ ను ఇంటికే పిలిపించుకుంటూ ఉంది. అయితే రాహుల్ ప్రవర్తనలో తేడాలు రావడంతో జ్యోతిని ఆమె కూతురు గట్టిగా నిలదీసిందని సమాచారం. తన కూతురు బతికుంటే తన అక్రమ సంబందానికి పదేపదే అడ్డుపడుతుందని, కన్నకూతురు పీడ విడగించుకోవాలని జ్యోతి గట్టిగా డిసైడ్ అయ్యింది.
గురువారం రాత్రి కూతురిని జ్యోతి, ఆమె ప్రియుడు రాహుల్ కలిసి హతమార్చినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి నిందితురాలు జ్యోతి, ఆమె ప్రియుడు రాహుల్‌ను ధారవాడలోని సబర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఆరు రోజుల్లో ధార్వాడలో ఐదు హత్యలు జరిగాయి. తల్లి జ్యోతి ఆమె ప్రియుడు రాహుల్ తో కలిసి కన్న కూతురి గొంతు కోసి హత్య చేసినట్లు ఆరోపణలు రావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

అసిస్టెంట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఆత్మహత్యకు యత్నించిన ఘటన కర్ణాటకలోని రాయచూరు నగరంలోని జిల్లా స్టేడియంలో చోటుచేసుకుంది. రాయచూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డు కీపర్‌గా పనిచేస్తున్న వాసీం(35) ఆత్మహత్యకు యత్నించాడని పోలీసులు అంటున్నారు. పై అధికారి వేధింపులకు తాళలేక వాసీం యాసిడ్ తాగినట్లు ఆరోపణలు వచ్చాయి.
గురువారం మధ్యాహ్నం వరకు ఏసీ కార్యాలయంలోనే ఉన్న వాసీం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రాయచూరు జిల్లా స్టేడియం వద్దకు వెళ్లి అక్కడ యాసిడ్ తాగినట్లు సమాచారం. ప్రస్తుతం వాసీం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతను మృత్యువుతో పోరాడుతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై వాసీం కుటుంబ సభ్యులు రాయచూర్ వెస్ట్ స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాసీం యాసిడ్ తాగలేదని, అయితే అతనిని చంపేందుకు ఎవరో మా కుమారుడితో బలవంతంగా యాసిడ్ తాగించారని ఆరోపించారని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications