ముస్లీం మత గురువును పక్కాప్లాన్ తో లేపేశారు, చంపింది వాళ్లే, తమ్ముడు పొలిటికల్ !

మైసూరు మహానగర కార్పొరేషన్ మాజీ సభ్యుడు అయాజ్ (పండు) సోదరుడు, ముస్లిం మతపెద్దను అతి దారుణంగా హత్య చేసిన ఘటన మైసూరులో కలకలం రేపింది. మైసూరు సిటీలోని రాజీవ్ నగర్‌లోని నిమ్రా మసీదు సమీపంలో శుక్రవారం రాత్రి ఈ హత్య జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. రాజకీయ నాయకుడి సోదరుడు, మత పెద్ద హత్యతో మైసూరులోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అయాజ్ సోదరుడు ముస్లిం మతపెద్ద మౌలానా అక్మల్ (45) అనే ఆయన ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు. రాజీవ్ నగర్ నిమ్రా మసీదు సమీపంలోని ఆర్య బేకరీ ముందు ద్విచక్రవాహనంపై అక్మల్ వెళ్తుండగా అటువైపు వెళ్లిన దుండగులు ఆయన్ను అడ్డగించి మారణాయుధాలతో నరికి అతి దారుణంగా హత్య చేశారు. ఫ్లెక్సీలు కోసం జరిగిన గొడవ సందర్భంగా దానిని ప్రశ్నించిన ముస్లిం మతపెద్ద మౌలానా అక్మల్‌ను హత్య చేసినట్లు సమాచారం.

A Muslim cleric was hacked to death in Mysuru city in Karnataka

మూడు బైక్‌లపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడి మారాణాయుధాలతో మత గురువును నరికి చంపారు. మైసూరులోని ఉదయగిరిలోని మాదేగౌడ సర్కిల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. హత్యకు గురైన మత గురువు అక్మల్ పాషా మైసూర్ కార్పొరేషన్ మాజీ కార్పోరేటర్ నయాజ్ పాషా అలియాస్ పండుకు సొంత సోదరుడు.

గత నాలుగు రోజులుగా ఫ్లెక్సీల ఏర్పాటు చేసే విషయంల్ ముస్లీం మతంలోని ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయి.

ముస్లీం మత గురువు మౌలానా అక్మల్ హత్యకేసులో కేఎండీసీ అధ్యక్షుడు అల్తాఫ్‌, మైసూరు కార్పోరేషన్ కార్పోరేటర్ బషీర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అల్తాఫ్ మైనార్టీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత మైసూరుకు వచ్చారు. అల్తాఫ్ కు స్వాగతం పలికేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇలా చాలా హంగామా చేసి అల్తాఫ్ కు స్వాగతం పలికారు. దీనిని ప్రశ్నించడంతో మతపెద్ద మౌలానా అక్మల్ కార్పొరేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో అల్తాఫ్ ఖాన్‌కు వ్యతిరేకంగా అక్మల్ ఒక వీడియో విడుదల చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన అల్తాఫ్ మత గురువు అక్మల్ హత్యకు పాల్పడి ఉంటాడని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. ఉదయగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హత్యకు గురైన అక్మల్‌ను ఎస్‌డీసీఐలో సభ్యుడిగా ఉన్నాడని పోలీసు అధికారులు గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+