లవ్ మ్యారేజ్: టార్చర్, నవదంపతులతో సహ ఒకే ఫ్యామిలీలో ముగ్గురి ఆత్మహత్య !

ప్రేమ వివాహం చేసుకున్న నవదంపతులను వధువు కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చెయ్యడంతో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో జరిగింది.

బెంగళూరు: ప్రేమ వివాహం చేసుకున్న నవదంపతులను వధువు కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చెయ్యడంతో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో జరిగింది. నవదంపతులతో సహ ఓ బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

దావణగెరె తాలుకా గుడళు గ్రామంలో నటరాజ్ (40) నివాసం ఉంటున్నాడు. ఇతను తన కంటే 14 ఏళ్ల వయస్సు తక్కువ ఉన్న పల్లవి (24)ని ప్రేమించాడు. నటరాజ్ కు ఇంతకు ముందే వివాహం అయ్యింది. నటరాజ్ మొదటి భార్యకు ప్రదీప్ (15) అనే కుమారుడు ఉన్నాడు.

A newly wed couples commits suicide in Gudalu village in Karnataka.

నటరాజ్, పల్లవి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అయితే వీరి పెళ్లికి పల్లవి కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. పెద్దలను ఎదిరించిన పల్లవి నాలుగు రోజుల క్రితం నటరాజ్ ను వివాహం చేసుకుంది. మమ్మల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారని పల్లవి కుటుంబ సభ్యులు నవదంపతులను వేధింపులకు గురి చేశారు.

కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చెయ్యడం జీర్ణించుకోలేని నవదంపతులు నటరాజ్, పల్లవి గ్రామం సమీపంలో ఒకే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి, చిన్నమ్మ ఆత్మహత్య చేసుకున్నారని తెలుసుకున్న ప్రదీప్ ఇంటిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి వేడుక జరిగిన నాలుగు రోజులకే ఆ కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+