SCSS: ఒక్కసారి పెట్టుబడితో నెలకు రూ.20,500..!
చాలా మంది జీవితంలో ఎంతో కష్టపడతారు. డబ్బులు సంపాదిస్తారు. అయితే ఆ డబ్బులను సరైన వాటిలో పెట్టుబడి పెడితే మరింత సంపాదించవచ్చు. ఇందుకోసం చాలా పెట్టుబడి పథకాలు ఉన్నాయి. అయితే తక్కువ వయస్సు ఉన్న వారు ఈక్విటీల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టడంతో పాటు గ్యారెంటీ పథకాల్లో పెట్టుబడి పెడితే మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రిటైర్మెంట్ వయస్సులో ఉన్న వారు.. ఇప్పటికే రిటైర్ అయిన వారి కోసం ఒక పథకం ఉంది.
ఈ పథకంలో కచ్చితమైన రాబడి వస్తుంది. ఈ పథకంలో ఇప్పటికే చాలా మంది సీనియర్ సిటిజన్లు పెట్టుబడి పెట్టారు. అదే పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకం. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా నెలకు గరిష్ఠంగా రూ.20,500 రాబడి పొందవచ్చు. ఈ పథకం కేవలం సీనియర్ సిటిజన్లకు మాత్రమే. 60 ఏళ్లు పైబడిన వారే ఈ ఖాతా తెరవొచ్చు. అయితే పథకంలో కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది సింగిల్ టైమ్ ఇన్వెస్ట్ మెంట్ పథకం.

ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు ప్రతి నెలా లేదా ప్రతి త్రైమాసికంలో వడ్డీ వస్తుంది. ఈ పథకంలో 55 నుంచి 60 సంవత్సరాల మధ్య వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వ్యక్తులు కూడా ఈ పథకంలో చేరవచ్చు. రక్షణ సేవల నుంచి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు కూడా 50 సంవత్సరాల వయస్సులో కూడా ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పథకంలో సింగిల్ గా చేరవచ్చు లేదా జాయింట్ గా చేరవచ్చు. భార్యాభర్తలు కలిసి జాయింట్ అకౌంట్ తీసి పెట్టుబడి పెట్టొచ్చు.
మీకు రిటైర్మెంట్ సమయంలో రూ.30 లక్షలు వచ్చాయనుకుంటే.. ఈ మొత్తాన్ని మీరు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకంలో పెట్టుబడి పెడితే.. మీకు సంవత్సరానికి రూ. 2.46 లక్షల లభిస్తుంది. మీరు నెల నెల తీసుకుంటే రూ.20,500, మూడు నెలలకు ఒక్కసారి తీసుకోవాలనుకుంటే రూ.61,500 వస్తాయి. మెచ్యూరిటీ తర్వాత మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం తిరిగి వస్తుంది. ప్రస్తుతం ఈ పథకంలో 8.2 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. పోస్టాఫీస్ స్కీమ్ ల్లో అత్యధిక వడ్డీ వచ్చే పథకాల్లో ఇది ఒకటి.












Click it and Unblock the Notifications