Python: తిరుచ్చి ఎయిర్ పోర్టులో కొండ చిలువలు.. షాకైన అధికారులు..
ఎయిర్ పోర్టులో బంగారంతో పట్టుబడిన వ్యక్తి. ఎయిర్ పోర్టులో డ్రగ్స్ పట్టుబడిన ప్రయాణికుడు. ఇలా చాలా మంది బంగారం, డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తుంటారు. పోలీసులకు పట్టుబడుతుంటారు. అయితే కొంత మంది పాములను కూడా అక్రమ రవాణా చేస్తుంటారు. తాజాగా ఓ ప్రయాణికిడు కొండచిలువలతో పట్టబడిన ఘటన తమిళనాడులోని తిరుచ్చి ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టులో ఆదివారం జరిగింది. కొండచిలువలతో పాటు రెండు బల్లులు కూడా ఉన్నాయి.
తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారులు ప్రయాణీకుల ట్రాలీ బ్యాగ్‌లో 47 పాములు, రెండు బల్లులను స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. నేరస్థుడిని మహమ్మద్ మొయిదీన్‌గా గుర్తించారు.
బాటిక్ ఎయిర్ విమానంలో తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకోగానే కస్టమ్స్ అధికారులు మొయిదీన్‌ను అడ్డుకున్నారు. అతని బ్యాగ్‌లు చెక్ చేయగా.. వివిధ రకాల, పరిమాణాల సరీసృపాలను అనేక చిల్లులు గల పెట్టెల్లో దాచి ఉంచారు.

అటవీశాఖ అధికారులు విమానాశ్రయానికి చేరుకుని 47 కొండచిలువలు, రెండు బల్లులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం సరీసృపాలను తిరిగి మలేషియాకు పంపించేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. విచారణ నిమిత్తం మొయిదీన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
తదుపరి విచారణ జరుగుతోంది. నిందితుడు రంధ్రాలున్న పెట్టెల్లో వాటిని తీసుకువచ్చాడు.

ఎయిర్ పోర్టుల్లో గతంలో కూడా కొండ చిలువలు తరలించిన ఘటనలు ఉన్నాయి. పలు రకాల కొండ చిలువలు మంచి డిమాండ్ ఉండడంతో వాటిని అక్రమ రవాణా చేస్తున్నారు. అయితే శంషాబాద్ ఎయిర్ పోర్టులు అక్రమ బంగారం రవాణా చేసేవారు ఎక్కువ పట్టుబడుతుంటారు. భారత్ లోకి అనుమతి లేకుండా బంగారం తీసుకురావడం నేరం.












Click it and Unblock the Notifications