పరీక్షలకు భయపడి అమ్మాయి ఏం చేసిందంటే ?, కూతురు చదువు కోవాలని ఒంటరిగా !
విద్యార్థులు అందరూ పరీక్షల మూడ్‌లో ఉన్నారు. అయితే మనస్థాపానికి గురై ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటంతో ఆమె కుటుంబ సభ్యులు సాటి విద్యార్థులు హడలిపోయారు.
బెంగళూరు/కొడుగు: దేశవ్యాప్తంగా విద్యార్థులు పరీక్షల మూడ్ లో ఉన్నారు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు మొదలైనాయి, పలు రాష్ట్రాల్లో పదవ తరగతి పరీక్షల్లో ఒకే ఒక్క పరీక్ష మిగిలిఉంది. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా మార్చి 13 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం అయ్యాయి. 1 నుండి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు, అయితే అందులో 5వ తరగతి, 8వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఇప్పుడే నిర్వహించడం లేదు,
విద్యార్థులు అందరూ పరీక్షల మూడ్‌లో ఉన్నారు. అయితే మనస్థాపానికి గురై ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటంతో ఆమె కుటుంబ సభ్యులు సాటి విద్యార్థులు హడలిపోయారు. అమ్మాయి కుటుంబంలో ఎలాంటి మానసిక కుంగుబాటుకు గురికాకపోయినా కేవలం పరీక్షల ఒత్తిడితో మైనర్ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని సోమవారపేట్ పట్టణంలో వైష్ణవి (13) అనే అమ్మాయి నివాసం ఉంటున్నది, సోమవారపేట్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వైష్ణవి 7వ తరగతి చదువుతోంది. వారం రోజుల క్రితం కర్ణాటకలో 7వ తరగతి పరీక్షలు మొదలైనాయి. పరీక్షలు రాయడానికి వెలుతున్న వైష్ణవి ఇంటికి వెళ్లిన తరువాత ఈ రోజు పరీక్ష బాగానే రాశాను అని ఆమె తల్లిదండ్రులకు చెబుతోంది.
సోమవారం పరీక్ష ఉండటంతో వైష్ణవి ఇంట్లో చదువుకుంటున్నది. అమ్మాయి 7వ తరగతి పాస్ కావాలని అనుకున్న ఆమె కుుటంబ సభ్యులు ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. నువ్వు బాగా చదువుకో అని వైష్ణవికి చెప్పిన తల్లి కూడా బంధువులతో కలిసి బయటకు వెళ్లిపోయారు. ఆ సందర్బంలో ఇంటిలో ఒంటరిగా ఉన్న వైష్ణవి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
రాత్రి ఇంటికి వెళ్లిన కుటుంబ సభ్యులు వైష్ణవి ఆత్మహత్య చేసుకున్న పోలీ్సులకు సమాచారం ఇచ్చారు. 7వ తరగతి పరీక్షల ఒత్తిడితోనే వైష్ణవి ఆత్మహత్య చేసుకుందనని, ఆమె ఇంట్లో కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగానే ఉండేదని పోలీసులు తెలిపారు. సాటి అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంతో ఆమెతో పాటు చదువుతున్న అమ్మాయిలకు కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పి పరీక్షలు రాయడానికి పంపిస్తున్నారు,
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications