బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు మాతో టచ్ లో ఉన్నారు. సింగపూర్ నుంచి వస్తేనే, జేడీఎస్ !
బెంగళూరు/సింగపూర్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యాయి. కొన్ని గంటల్లో కౌంటింగ్ మొదలౌతుంది. కర్ణాటకలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని, కర్ణాటకలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వానికి ఎక్కువ చాన్స్ లు ఉన్నాయని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి, కర్ణాటకలో కింగ్ మేకర్ గా అవతరిస్తున్న జేడీఎస్ దళపతి హెచ్ డీ. కుమారస్వామి ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులతో చర్చల జరిపారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు బాంబుపేల్చారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఆరు నెలల నుంచి విశ్రాంతి లేకుండా ఏక్ నిరంజన్ అంటూ పంచరత్న యాత్ర పేరుతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేసిన హెచ్.డీ. కుమారస్వామి పోలింగ్ కు ముందే అనారోగ్యానికి గురై బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. మే 10వ తేదీన పోలింగ్ రోజు కూడా మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి తీరికలేకుండా గడిపారు.

సోలింగ్ జరిగిన రోజు కొందరు స్నేహితులతో కలిసి హెచ్ డీ. కుమారస్వామి సింగపూర్ వెళ్లిపోయారు. సాధారణ మెడికల్ చెకప్ కోసం మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి సింగపూర్ వెళ్లారని జేడీఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే సింగపూర్ లో ఉన్న మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి కౌంటింగ్ జరిగే మే 13వ తేదీన శనివారం మళ్లీ బెంగళూరు చేరుకుంటారు.
కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంపూర్ణ మెజారిటీ రాదని ఎగ్జిట్ పోల్స్ లో వెలుగు చూడటంతో ఇప్పుడు ప్రాంతీయ పార్టీ జేడీఎస్ కింగ్ మేకర్ అయిన జేడీఎస్ ఏ పార్టీకి మద్దతు ఇస్తుంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామితో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చలు జరిపారని జేడీఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తన్వీర్ అహమ్మద్ బాంబు పేల్చారు.
ఎన్ డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో తన్వీర్ అహమ్మద్ మాట్లాడుతూ మా నాయకుడు హెచ్.డీ. కుమారస్వామితో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు ఇప్పటికే చర్చలు జరిపారని, చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని, సింగపూర్ నుంచి హెచ్ డీ. కుమారస్వామి బెంగళూరు చేరుకున్న తరువాత ఎవరికి మద్దతు ఇవ్వాలి అని డిసైడ్ చేస్తారని తన్వీర్ అహమ్మద్ చెప్పారు.

జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ కు డబ్బులు, జాతీయ నాయకుల అండదండలు ఉన్నాయని, అయితే ప్రజల సంక్షేమం ముఖ్యం అని బావించిన మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ, మాజీ సీఎం కుమారస్వామి ఎవ్వరిని పట్టించుకోకుండా కన్నడిగుల కోసం ఒంటరిగా రెండు పార్టీలను ఎదుర్కొనిందని, కన్నడిగులు కూడా ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్ వైపు మొగ్గు చూపారని జేడీఎస్ పార్టీ సీనియర్ నాయుకుడు తన్వీర్ అహమ్మద్ అన్నారు.
శనివారం సింగపూర్ నుంచి బెంగళూరు చేరుకుంటున్న మా నాయకుడు హెచ్ డీ, కుమారస్వామి తీసుకునే నిర్ణయానికి మా పార్టీ కట్టుబడి ఉంటుందని, ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి అని ఆయనే డిసైడ్ చేస్తారని, కౌంటింగ్ పూర్తి అయిన తరువాత అసలు మ్యాటర్ తెలుస్తోందని జేడీఎస్ పార్టీ లీడర్ తన్వీర్ అహమ్మద్ ఎన్ డీటీవీకి ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు.
ఇటీవల మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు శోభా కరందాజ్లే కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదని, బీజేపీకి 120 నుంచి 125 సీట్లు వస్తాయని, మేము జేడీఎస్ పార్టీని ఇంత వరకు సంప్రధించలేదని స్పష్టం చేశారు. కర్ణాటకలో కచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని కేంద్ర మంత్రి శోభా కరందాజ్లే క్లారిటీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications