వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: మనిషి సజీవదహనమౌతోంటే వీడియోలు తీశారు

మనిషిలో మానవత్వ విలువలు మంటగలిసిపోతున్నాయి. మానవుడు టెక్నాలజీ పరంగా అభివృద్ది చెందినా పూర్వ కాలంలో ఉన్నట్టుగా మానవత్వ విషయంలో మాత్రం ఆ రకంగా వ్యవహరించడం లేదు.అయితే ఓ వ్యక్తి చావుబతుకుల మధ్య కొట్టుమి

By Narsimha
|
Google Oneindia TeluguNews

బీడ్: మనిషిలో మానవత్వ విలువలు మంటగలిసిపోతున్నాయి. మానవుడు టెక్నాలజీ పరంగా అభివృద్ది చెందినా పూర్వ కాలంలో ఉన్నట్టుగా మానవత్వ విషయంలో మాత్రం ఆ రకంగా వ్యవహరించడం లేదు.అయితే ఓ వ్యక్తి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంటే అతడిని కాపాడే ప్రయత్నం చేయకపోగా ఆ దృశ్యాన్ని వీడియోలో బంధించేందుకు ప్రయత్నించిన ఘటన మరోటి మహరాష్ట్రలో వెలుగుచూసింది.

గతంలో ఇదే తరహా ఘటనలో దేశంలోని పలుచోట్ల వెలుగుచూశాయి. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ ఎస్ ఐ ను ఆసుపత్రికి తరలించకుండా చోద్యం చూశారు స్థానికులు. అయితే ఈ ప్రమాద దృశ్యాలను మాత్రం వీడియో తీసి పోస్ట్ చేశారు. ఇదే తరహా ఘటన తాజాగా మహారాష్ట్రలో చోటుచేసుకొంది.

A shocking incident happened in Beed district at Maharashtra state

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని ఓ రహాదారిపై రెండు బైక్ లు ఢీకొన్నాయి.అయితే ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవదహానమయ్యాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఓ వ్యక్తి బైక్ కింద పడిపోయాడు. అయితే వెంటనే ఆ బైక్ కు మంటలు అంటుకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి సజీవదహనమయ్యాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కొందరు అక్కడికి చేరుకొన్నాడు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయలేదు.పైగా ఈ ఘటనను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించేందుకుగాను ప్రయత్నాలు చేశారు.

అయితే ఏ ఒక్కరైనా సకాలంలో స్పందించినా సజీవ దహనమైన వ్యక్తి కూడ ప్రాణాలతో బయటపడేవారు.అయితే ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అయితే ఈ వీడియోను తీసేందుకు ప్రయత్నించినవారు ప్రాణాలను కాపాడేందుకు మాత్రం ప్రయత్నించలేదు.చివరకు ఈ వీడియో ఆధారంగానే మనిషి ఏ రకంగా మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారనే విషయం వెల్లడైంది.

English summary
A shocking incident happened in Beed district at Maharashtra state. man lively burning in road accident recently. if anyone respond quickly he is alive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X