మర్మాంగం మీద పెట్రోల్ పోసి నిప్పంటించి వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టారు, వైరల్!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: రోడ్డు పక్కన నిద్రపోతున్న వ్యక్తి మర్మాంగం మీద పెట్రోల్ పోసి నిప్పంటించి అతని ప్రాణాలు తియ్యడానికి ప్రయత్నించిన ఘటన చెన్నై నగరంలో జరిగింది. చెన్నైలోని కూడంబాక్కం ప్రాంతంలో జాఫర్ (50) అనే వ్యక్తి మీద హత్యాయత్నం జరిగిందని పోలీసులు చెప్పారు.

నకిలి టెక్కీ: ఫేస్ బుక్ లవ్, పెళ్లికి నో చెప్పిన యువతి ఇంటికెళ్లి చీల్చేశాడు, ఆమె చెల్లిని!

కూడంబాక్కంలోని రాంగరాజపురంలోని ఇండియన్ బ్యాంకు సమీపంలో అర్దరాత్రి 1.30 గంటల సమయంలో జాఫర్ రోడ్డు పక్కన నిద్రపోతున్నాడు. పీకలదాక మద్యం సేవించిడంతో జాఫర్ అపస్మారకస్థితిలో ఉన్నాడు. ఆ సందర్బంలో ముగ్గురు నిందితులు అటు వైపు వెళ్లారు.

మద్యం, పెట్రోల్ పోసి !

మద్యం, పెట్రోల్ పోసి !

తరువాత మద్యం, పెట్రోల్ జాఫర్ మర్మాంగం మీద పోసి నిప్పంటించారు. తీవ్రగాయాలు కావడంతో జాఫర్ నిద్రలేచి కేకలు వేశాడు. ఆ సందర్బంలో నిందితులు పైప్ లు తీసుకుని జాఫర్ మీద దాడి చేసి హత్య చెయ్యడానికి ప్రయత్నించారు.

వీడియో తీశారు!

వీడియో తీశారు!

జాఫర్ మర్మాంగానికి నిప్పంటించే సమయంలో ఇద్దరు నిందితులు అతని దగ్గరే ఉన్నారు. మరో నిందితుడు మొబైల్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పైకి లేచి మంటలు అదుపు చేసుకోవడానికి ప్రయత్నించిన జాఫర్ మీద మళ్లీ దాడి జరిగింది.

యూట్యూబ్ లో వైరల్ !

యూట్యూబ్ లో వైరల్ !

సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కావడంతో పలువురు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జాఫర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని విచారించి వివరాలు సేకరించారు.

వీడియోలో అడ్డంగా బుక్కయ్యారు!

వీడియోలో అడ్డంగా బుక్కయ్యారు!

సోషల్ మీడియాలో వీడియో పరిశీలించిన పోలీసులు శ్యామ్, పూహళేంది, రాజేష్ అనే ముగ్గురిని అరెస్టు చేశారు. మద్యం మత్తులో ఉన్న తన మీద నిందితులు ముగ్గురూ కలిసి హత్యాయత్నం చేశారని జాఫర్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

కారణం తెలీదు!

కారణం తెలీదు!

జాఫర్ మర్మాంగం మీద పెట్రోల్, మద్యం పోసి నిప్పంటించిన నిందితులు పీకలదాక మద్యం సేవించారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అయితే జాఫర్ ఫిర్యాదు చేసిన తరువాతే ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాలని పోలీసు అధికారులు నిర్ణయించారని సమాచారం. జాఫర్ మర్మాంగం మీద పెట్రోల్ పోసి ఎందుకు నిప్పంటించారు ? అని ఆరా తీస్తున్నామని అధికారులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A shocking video of miscreants attacking a homeless man and trying to burn his private parts has gone viral.The incident occurred on June 4 at Kodambakkam. 50-year-old Jaffar was sleeping near the Indian Bank at Rangaraja Puram when at around 1:30 in the night, Shyam, Pugazendhi and Rajesh along with a minor harassed him.
Please Wait while comments are loading...