బెంగళూరు: ఉగ్రవాదుల స్కెచ్ ?, వాళ్లను సీసీబీకి అప్పగించాలని ప్రత్యేక కోర్టు ఆదేశాలు !
బెంగళూరు/న్యూఢిల్లీ: బెంగళూరులో ఇటీవల జరిగిన వరుస బాంబు పేలుళ్ల కుట్రలో అరెస్టు అయిన ఐదుగురు అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాదులను 10 రోజుల పోలీసు కస్టడీకి తరలించాలని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. జూన్ 19న హెబ్బాళ సమీపంలోని సుల్తాన్ పాళ్యకు చెందిన సయ్యద్ సుహైల్ ఖాన్ ఇంటిపై బెంగళూరు సీసీబీ పోలీసులు దాడులు చేశారు.
తరువాత పులకేశి నగర్‌కు చెందిన సోహైల్, మహ్మద్ ఫైజల్ రబ్బానీ, కొడిగేహళ్లికి చెందిన మహ్మద్ ఉమర్, జహీద్ తబ్రేజ్, ఆర్‌టీ నగర్‌కు చెందిన సయ్యద్ ముదసీర్ పాషాలను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం బెంగళూరు సీసీబీ అధికారులు అతడిని 7 రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నారు.

ఈ కేసులో విచారణ నిమిత్తం జైలులో ఉన్న 2008 బెంగళూరు వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు నసీర్‌ను అరెస్టు చేసేందుకు బాడీ వారెంట్ జారీ చేయాలని కోరుతూ బెంగళూరు సీసీబీ పోలీసులు ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం నసీర్‌ను కోర్టు ముందు హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది.
ఐటీ హబ్ బెంగళూరును చాలాకాలం నుంచి ఉగ్రవాదులు టార్గెట్ చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇంతకు ముందు కూడా బెంగళూరులో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి, ఐటీ హబ్ ను లక్షంగా చేసుకుని దాడులు చేస్తే మన ఉనికిని చాటుకున్నట్లు అవుతుందని ఉగ్రవాదులు బెంగళూరును టార్గెట్ చేసుకునే అవకాశం ఉందని గతంలో పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. మొత్తం మీద బెంగళూరు పోలీసుల పుణ్యమా అంటూ ఉగ్రదాడులు జరగకుండా ఐటీ హబ్ ను కాపాడుతున్నారు.












Click it and Unblock the Notifications