వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది: ఏసీ స్పా హోటల్

|
Google Oneindia TeluguNews

జైపూర్: కుక్కలు రాజభోగం అనుభవిస్తున్నాయి. ఇంటిలో యజమానులతో కాలక్షేపం చేసే కుక్కలకు ఇప్పుడు మనుషులు అనుభవిస్తున్న అన్నివిలాసాలు, వసతులు వాటికి అందుబాటులోకి వచ్చాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే.

రాజస్థాన్ లోని జై పూర్ లో కుక్కల కోసం ప్రత్యేకంగా స్పా హోటల్ ఏర్పాటు చేశారు. 20 గదులు, కుక్కల కోసం ప్రత్యేకంగా ఎర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ అక్కడ ఉంది. ఎయిర్ కండిషన్డ్ తో ఈ స్పా హోటల్ ఎర్పాటు చేశామని నిర్వహకులు తెలిపారు.

కుక్కలు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇక్కడ సేద తీరేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అంటున్నారు. ఇక్కడికి వచ్చే కుక్కలను పిల్లల్లా చూసుకుంటున్నామని చెప్పారు. కుక్కలకు ఆనందం కలిగించాలన్నదే తమ లక్ష్యమని, అందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అంటున్నారు.

కుక్కలను స్పాకు తీసుకు వచ్చే వాటి యజమానులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండ ప్రత్యేక గదులు ఏర్పాటు చేశామని అంటున్నారు. కుక్కలు హాయిగా తిరగడానికి, నిద్రించడానికి విశాలమైన గదులు ఏర్పాటు చేశామని చెప్పారు.

A Special hotel with spa for dogs in Jaipur City

ఈ స్పాకు తీసుకు వచ్చే కుక్కలకు అన్ని వసతులు కల్పించి రూ. 599 వసూలు చేస్తున్నామని అన్నారు. కుక్కల కోసం ప్రత్యేకంగా శాకాహార, మాంసాహార వంటలు చెయ్యడానికి ఒక కిచెన్ ఏర్పాటు చేశామని అన్నారు.

అందులో ప్రత్యేక శిక్షణ పోందిన కుక్ ఇండియన్, చైనీస్, మెక్సికన్ రుచులతో వంటలు చేస్తారని, మంచి ఎనర్జి ఉండే డ్రింక్స్ అందిస్తున్నామని అన్నారు. శిక్షణ పొందిన నిపుణులు స్పాలో పని చేస్తున్నారని నిర్వహకులు అంటున్నారు.

కుక్కలతో పాటు ఇక్కడి స్పాలో కుందేళ్లు, చిలుకలు, పిల్లులు తదితర పెంపుడు జీవాలకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. గతంలో ఒక మహానుభావుడు ఇంగ్లీష్ లో ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందని సామెత చెప్పారు. ఇప్పుడు ఇది చూస్తుంటే అది నిజమనిపిస్తుంది.

English summary
Every dog can have its day. At least in the Pink City, were a fully air-conditioned hotel with 20 kennels or rooms for dogs has come up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X