బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రన్ వే మీద పేలిన విమానం టైర్, 78 మంది ప్రయాణీకులు క్షేమం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: రన్ వే మీద విమానం టైర్ పేలిపోయి పోలాలలోకి దూసుకు వెళ్లిన సంఘటన కర్ణాటకలోని హుబ్బళి నగరంలో జరిగింది. స్పస్ జెట్ విమానంలోని 78 మంది ప్రయాణిలు క్షేమంగా బయటపడ్డారు. విమానంలో మంత్రితో పాటు న్యాయమూర్తులు, ప్రముఖులు ఉన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు హుబ్బళి విమానాశ్రయం చేరుకున్నారు.

ఆదివారం సాయంత్రం 5.56 గంటలకు బెంగళూరు విమానాశ్రయం నుండి స్పస్ జట్ విమానం హుబ్బళికి బయలుదేరింది. విమానంలో 78 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది ఉన్నారు. రాత్రి 7.15 గంటల సమయంలో విమానం హుబ్బళి ఎయిర్ పోర్టు చేరుకుంది. రన్ వే మీద విమానం దిగుతున్న సమయంలో వెనుక చక్రాల టైరు పేలిపోయింది.

విమానం అదుపు తప్పి రన్ వే మీద నుండి పక్కకు వెళ్లి 100 మీటర్లు దూరంలో కొత్తగా నిర్మిస్తున్న రన్ వేని దాటుకుని పోలాలలోకి వెళ్లి పోయింది. ఆ సమయంలో విమానం పైలెట్ కార్తిక్ సమయస్పూర్పితో ఇంజన్ ఆఫ్ చేసి విమానంను అదుపులోకి తెచ్చారు. విమానంలోని ప్రయాణీకులు ఆర్తనాదాలు చేశారు.

A SpiceJet plane from Bangalore, with 78 people on board, skidded off the runway

స్పైస్ జెట్ విమానంలో రాష్ట మంత్రి రోషన్ బేగ్, విధాన పరిషత్ సభ్యుడు మహంతేష్, హైకోర్టు న్యాయమూర్తులు బీఎస్ పాటిల, రత్నకళ, బి మనోహర్, వీఆర్ఎల్ సంస్థల న్యాయ సలహాదారుడు ఆర్ బి గదగకర తదితర ప్రముఖులు ఉన్నారు. మంత్రి రోషన్ బేగ్ వస్తున్నారని ముందుగానే సమాచారం ఉండటంతో ఎస్కార్ట్ కోసం రైల్వే ఏడీజీపీతో పాటు అధిక సంఖ్యలో పోలీసులు విమానాశ్రం దగ్గరకు చేరుకున్నారు.

విమానం టైరు పేలిపోయిన సమయంలో పోలీసులతో పాటు బెంగళూరుకు వెళ్లవలసిన ప్రయాణికులు, ఎయిర్ పోర్టు సిబ్బంది ఆందోళన చెందారు. విమానం అదుపులోకి తీసుకువచ్చి పెద్ద ప్రమాదం జరకుండా చూసి అందరి ప్రాణాలు కాపాడిన పైలెట్ కార్తిక్‌ను మంత్రి రోషన్ బేగ్‌తో పాటు న్యాయమూర్తులు, ప్రయాణికులు, అధికారులు అభినందించారు.

ఈ ప్రమాదంలో విమానం చాల భాగం దెబ్బతింది. విమానం బాగు చెయ్యడానికి సమయం తీసుకుంది. సోమవారం సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విమానం ప్రమాదంపై దర్యాప్తు జరుగుతున్నదని జిల్లాధికారి పి రాజేంద్ర జోళన్ తెలిపారు.

English summary
A SpiceJet plane from Bangalore, with 78 people onboard, sunday skidded off the runway after landing at at Hubli airport in Karnataka due to heavy rain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X