College: తల్లిదండ్రుల ముందే ఐదు ఫ్లోర్ నుంచి దూకి ఇంజనీరింగ్ అమ్మాయి ఆత్మహత్య, ఏం జరిగింది !

చెన్నై/కాంచీపురం: కరోనా వైరస్ లాక్ డౌన్ దెబ్బతో ఇంజనీరింగ్ అమ్మాయి కొంతకాలంగా ఆన్ లైన్ క్లాసుల్లో చదువుకుంటూ ఇంట్లోనే ఉంటున్నది. ప్రభుత్వ నియమాలతో ఇటీవల ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభం అయ్యింది. తాను కాలేజ్ కు వెళ్లనని అమ్మాయి ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. కుటుంబ సభ్యులు బలవంతంగా అమ్మాయిని కాలేజ్ కు పిలుచుకుని వెళ్లారు. కాలేజ్ యాజమాన్యం ముందే తాను ఇక్కడ చదవలేనని ఆ అమ్మాయి చెప్పింది. మీరు ఇంటికి పిలుచుకుని వెళ్లి కొన్ని రోజుల తరువాత అమ్మాయిని కాలేజ్ కు పిలిచుకుని రావాలని కాలేజ్ యాజమాన్యం చెప్పింది. కాలేజ్ యాజమాన్యంతో అమ్మాయి కుటుంబ సభ్యులు మాట్లాడి బయటకు వచ్చారు. ఇదే సమయంలో పైన తన రూమ్ లో ఉన్న వస్తువులు తీసుకుని వస్తానని చెప్పిన అమ్మాయి కాలేజ్ ఐదవ అంతస్తు మీదకు వెళ్లి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

 సిమెంట్ కంపెనీలో తండ్రి మేనేజర్

సిమెంట్ కంపెనీలో తండ్రి మేనేజర్

కర్ణాటకకు చెందిన తంగకుమార్ అనే వ్యక్తి తమిళనాడులోని అలయలూరు జిల్లాలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీ కంపెనీలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. భార్య, కుమార్తె అభిత (19)తో కలిసి తంగకుమార్ నివాసం ఉంటున్నాడు. సిమెంట్ ఫ్యాక్టరీలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న తంగకుమార్ భార్య, కుమార్తెను పోషిస్తున్నాడు.

 ఇంజనీరింగ్ రెండో సంవత్సరం

ఇంజనీరింగ్ రెండో సంవత్సరం

కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబదూర్ సమీపంలోని తాండలం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో అభిత హాస్టల్ లో ఉంటూ ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతోంది. కరోనా వైరస్ లాక్ డౌన్ దెబ్బతో ఇంజనీరింగ్ చదువుతున్న అభిత కొంతకాలంగా ఆన్ లైన్ క్లాసుల్లో చదువుకుంటూ ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నది. ప్రభుత్వ నియమాలతో ఇటీవల అభిత చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభం అయ్యింది.

 చదవడం ఇష్టం లేదు

చదవడం ఇష్టం లేదు

తాను కాలేజ్ కు వెళ్లనని అభిత ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. రెండు సంవత్సరాలు చదువు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం చెయ్యాలని అభితకు ఆమె తండ్రి తంగకుమార్, తల్లి నచ్చచెప్పారు. కుటుంబ సభ్యులు బలవంతంగా అభితను కాంచీపురంలోని కాలేజ్ కు పిలుచుకుని వెళ్లారు. కాలేజ్ యాజమాన్యం ముందే తాను ఇక్కడ చదవలేనని అభిత చెప్పింది.

డిప్రెషన్ లో ఉంది పిలుచుకుని వెళ్లండి

డిప్రెషన్ లో ఉంది పిలుచుకుని వెళ్లండి

కాలేజ్ యాజమాన్యం ముందే తాను ఇక్కడ చదవలేనని చెప్పిన అభితకు కాలేజ్ యాజమాన్యం అక్కడే కౌన్సిలింగ్ ఇచ్చింది. ఎంతమంది చెప్పినా అభిత మాత్రం మనసు మార్చుకోలేదు. మీ అమ్మాయి అభిత ఇప్పుడు డిప్రెషన్ లో ఉందని, మీరు ఇంటికి పిలుచుకుని వెళ్లి రెండు మూడు వారాల తరువాత అభితను కాలేజ్ కు పిలిచుకుని రావాలని కాలేజ్ యాజమాన్యం ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది.

 ఐదో అంతస్తుల నుంచి దూకేసిన అమ్మాయి

ఐదో అంతస్తుల నుంచి దూకేసిన అమ్మాయి

కాలేజ్ యాజమాన్యంతో అభిత కుటుంబ సభ్యులు మాట్లాడి బయటకు వచ్చారు. ఇదే సమయంలో పైన తన రూమ్ లో ఉన్న వస్తువులు తీసుకుని వస్తానని చెప్పిన అభిత మేడ మీదకు వెళ్లింది. తరువాత కాలేజ్ ఐదవ అంతస్తు మీదకు వెళ్లిన అభిత అక్కడి నుంచి కిందకు దూకేసింది. కాలేజ్ సిబ్బంది, కుటుంబ సభ్యులు పరుగు తీసి అభితను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

 షాక్ అయిన ఫ్యామిలీ

షాక్ అయిన ఫ్యామిలీ

చికిత్స విఫలమై అభిత ప్రాణం పోయింది. కుటుంబ సమస్యలతో అభిత ఆత్మహత్య చేసుకుందా ?, కాలేజ్ లో ఆమెకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ? అనే విషయంలో పక్కాసమాచారం లేదని, విచారణ చేస్తున్నామని కాంచీపురం పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు కాలేజ్ ఆవరణంలో ఉన్న సమయంలోనే అభిత ఐదవ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసకోవడంతో సాటి విద్యార్థులు హడలిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+