టీటీవీ దినకరన్ దెబ్బకు ఐపీఎస్ అధికారులు, న్యాయవాది బలి: లిస్టులో!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పిచ్చిచేష్టలతో పలువురు కటకటాలపాలై పోవడానికి సిద్దంగా ఉన్నారని స్పష్టంగా కనపడుతోంది. ఎన్నికల యంత్రాంగానికి ఏకంగా రూ. 50 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని దినకరన్ అరెస్టు అయిన విషయం తెలిసిందే.

ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల విచారణలో టీటీవీ దినకరన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. ఆయన ఎవ్వరెవ్వరి దగ్గర నగదు వసూలు చేసి ఎన్నికల కమిషన్ కు లంచం ఎర వెయ్యడానికి ప్రయత్నించారు అంటూ ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

న్యాయవాదికి చుట్టుకున్న ఉచ్చు

న్యాయవాదికి చుట్టుకున్న ఉచ్చు

ఎన్నికల కమిషన్ కు లంచం ఎర వేశారని నమోదు అయిన కేసులో అరెస్టు అయిన దినకరన్ తో సన్నిహితంగా ఉంటున్న న్యాయవాది గోపి అనే వ్యక్తికి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేసు విచారణకు హాజరుకావాలని సమన్లలో న్యాయవాది గోపికి స్పష్టంగా సూచించారని వెలుగు చూసింది.

మాజీ అధికారి

మాజీ అధికారి

గృహ నిర్మాణ శాఖలో పని చేస్తూ పదవీ విరమణ చేసిన అధికారి మోహనరంగన్ కు చెందిన చెన్నైలోని అదంబాక్కం ఇంటిలో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసు అధికారులు సోదాలు చేశారు. మోహనరంగన్ కు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసు అధికారులు సమన్లు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

మోహనరంగన్, మన్నార్ గుడి సభ్యుడు

మోహనరంగన్, మన్నార్ గుడి సభ్యుడు

గృహ నిర్మాణ శాఖలో పని చేస్తూ పదవీ విరమణ చేసిన అధికారి మోహనరంగన్ మన్నార్ గుడి సభ్యుడు అనే విషయం తమిళనాడు మొత్తం తెలుసు. టీటీవీ దినకరన్ కు అన్ని విదాలుగా ఈయన సహకరించారని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

అక్కడ సీన్ తో హడల్

అక్కడ సీన్ తో హడల్

ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన బ్రోకర్ సుఖేష్ చంద్రశేఖర్ ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన వెంటనే కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో టీటీవీ దినకరన్ పేరు నమోదు చెయ్యడంతో అన్నాడీఎంకే నాయకులు హడలిపోయారు.

ముగ్గురు ఐపీఎస్ అధికారుల మెడకు !

ముగ్గురు ఐపీఎస్ అధికారుల మెడకు !

ఢిల్లీలో కేసు నమోదు అయిన వెంటనే దినకరన్ తమిళనాడుకు చెందిన ముగ్గురు సీనిరయర్ ఐపీఎస్ అధికారులతో ఫోన్ లో మాట్లాడారని, ఆముగ్గురు పోలీసు అధికారులు దినకరన్ ను కేసు నుంచి తప్పించడానికి ప్రయత్నించారని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసు అధికారులు గుర్తించారు.

ఐపీఎస్ అధికారుల విచారణ

ఐపీఎస్ అధికారుల విచారణ

తమిళనాడుకు చెందిన ముగ్గరు ఐపీఎస్ అధికారులను విచారించడానికి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసు అధికారులు సిద్దం అయ్యారని వెలుగు చూసింది. దినకరన్ ను ఎందుకు కేసు నుంచి తప్పించడానికి ప్రయత్నించారు ? ఆయనతో వీరికిఏం సంబంధం ? అంటూ ఢిల్లీ పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

ఢిల్లీ దెబ్బకు చెన్నై విలవిల

ఢిల్లీ దెబ్బకు చెన్నై విలవిల

ఢిల్లీ పోలీసు అధికారుల దెబ్బకు చెన్నైలో టీటీవీ దినకరన్ అనుచరులు హడలిపోతున్నారు. ఎలాగైనా కేసు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే వారి జుట్టు ఢిల్లీ పోలీసుల చేతికి చిక్కడంతో హడలిపోతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Delhi Police summons 3 persons including lawyer Gopi at Tiruverkadu in EC ADMK Two leaves symbol bribery case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి