దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్ర‌మాదం...న‌లుగురు మృతి..

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9 నెలల చిన్నారి సహా ఇద్దరు మహిళలు, ఓ బాలుడు మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. ఈ సంఘ‌ట‌న ఢిల్లీలోని షాదాపా స‌మీపంలోని వీధి నంబర్ 26లోని ఓ ఇంటి కింది అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ సంఘ‌ట‌న శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

ఓ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్ర‌మాద‌వ‌శాత్తు మంటలు చెలరేగిన‌ట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి పై అంతస్తుకు మంటలు వ్యాపించాయి. దీంతో దట్టమైట‌ పొగ అలుముకోవడంతో ఈ ప్ర‌మాదంలో ఊపిరాడక నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తొమ్మిదినెల‌ల చిన్నారి స‌హా ఇద్ద‌రు మ‌హిళ‌లు, ఓ బాలుడు ఉన్న‌ట్లు స‌మాచారం.

A terrible fire accident in the capital of the country, Delhi... four people died..

ఈ ప్ర‌మాదంలో మ‌రో ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై స్పష్టమైన కారణం ఇంకా తెలియ‌లేదు. అగ్నిమాపక శాఖ అపస్మారక స్థితిలో ఉన్న ఇంటి నుండి కొంతమందిని జిటిబి ఆసుపత్రికి పంపారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు.

ప్రమాదం సమయంలో పై అంతస్తులో ఆరుగురు ఉన్నట్లు స‌మాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్ర‌మాదం గురించి అగ్నిమాపక అధికారి ఈ విధంగా మాట్లాడారు. "అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే, బృందం నుండి ఐదుగురిని సంఘటనా స్థలానికి పంపించ‌డం జ‌రిగింది. వారి సాయంతో కొంత మందిని సురక్షితంగా మంట‌ల నుంచి బ‌య‌టికి తేవ‌డం జ‌రిగింది. అదే సమయంలో పోలీసులకు కూడా విష‌యం తెలియ‌డంతో పీసీఆర్ వ్యాన్ అక్కడికి చేరుకుంది అని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+