Crime News: ఆర్థిక ఇబ్బందులతో భార్య, కుమార్తెను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న భర్త..
అప్పుల బాధ తాలలేక ఓ కుటుంబం అనంతలోకాలకు వెళ్లిన విషాదకర ఘటన జరిగింది.
సమాజంలో చాలా మంది చాలా సెన్సిటివ్ గా ఉంటారు. ఏ చిన్న కష్టమొచ్చిన తట్టుకోలేరు. కానీ వారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కష్టాలు లేనది జీవితం ఉండదని.. ప్రతి మనిషికి కష్టాలొస్తాయి. అవి తట్టుకుని ముందుకు సాగితేనే జీవితం సంపూర్ణమవుతుంది. కానీ కొందరు చిన్ని కష్టాలకు తట్టుకోలేక పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మహత్యలు లేదా హత్యలు చేస్తుంటారు.
తాజాగా ఒడిశాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఓ యువకుకడు అప్పుల బాధతో భార్యతో పాటు కూతుర్నిని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కొరాపుట్ జిల్లాలోని లక్ష్మీపూర్ సమితి తొయపుట్ గ్రామానికి చెందిన లింగరాజు బిశోయ్ చరవాణి దుకాణం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే ఈ క్రమంలో అతను అప్పులు చేశాడు.

అప్పులు ఒత్తిడి పెరగడం.. అప్పు ఎలా చెల్లించాలో తెలియకపోవడంతో బిశోయ్ మానసికంగా ఆందోళన చెందాడు. ఆదివారం సాయంత్రం షాపు నుంచి ఇంటికి చేరుకున్న బిశోయ్ తలుపులేశాడు. మొదటగా భార్యను హత్య చేశాడు. తర్వాత కుమార్తెను కూడా హత్య చేశాడు. తర్వాత తాను ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సాయంత్రం వేసిన తలపులు రాత్రి 9 అయిన ఇంకా తీయకపోవడంతో పక్కింటివారు తలుపులు కొట్టారు. తలుపులు తీయకపోవడంతో కిటిలోంచి చూశారు. బెడ్ రూంలో ముగ్గురు విగతజీవులుగా పడి ఉండడం చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications