Viral Video: చిరుత పులితో ఆటలా.. ఫైర్ అవుతున్న నెటిజన్లు..
చిరుత పులి అంటే ఎవరికైనా భయం ఉంటుంది. ఎందుకంటే చిరుత తన పంజాతో ప్రాణాలు తీస్తుంది. అందుకే చిరుత అంటే భయం ఉంటుంది. కానీ ఓ వ్యక్తి చిరుతతో సయ్యటలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్న వ్యక్తిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

20 సెకన్ల క్లిప్
ఈ వీడియోలో ఓ వ్యక్తి చిరుతపులిని తోక పట్టి లాగుతున్నాడు. అతను అలా చేయడంపై ట్విట్టర్ యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 సెకన్ల క్లిప్‌ను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (IFS) అధికారి పర్వీన్ కస్వాన్ షేరు చేశారు. "ఇక్కడ ఉన్న జంతువును గుర్తించండి!!" క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి చిరుతపులిని దాని తోక, వెనుక కాళ్లను పట్టుకుని లాగుతున్నట్లు కనిపిస్తుంది.

83.7k వ్యూస్
చిరుత అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ విఫలమవుతుంది. అక్కడ ఉన్నవారు ఈ దృశ్యాలను తమ మొబైల్ లో చిత్రీకరించారు. ఈ వీడియోకు 83.7k వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు కోపంగా స్పందించారు. ఈ వీడియోను షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి కూడా జంతువుల పట్ల ఇలా ప్రవర్తించకూడదని చెప్పారు.
జైలుకు వెళతారు
"ప్రజలు ఈ రకమైన ప్రవర్తనను చూసినందుకు చాలా విచారంగా ఉంది. వారిని చట్ట ప్రకారం శిక్షించాలి' అని ట్విట్టర్ యూజర్ ఒకరు రాశారు. మరొక వినియోగదారు, "వారు జైలుకు వెళతారని నేను ఆశిస్తున్నాను" అని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications