Viral Video: వీడు మనిషేనా.. జాతీయ జెండాతో ఏం చేశాడంటే..?
మొన్న స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. ప్రతీ ఇంటిపై జాతీయ జెండా పెట్టుకున్నాం. మహానీయులను గుర్తుకు తెచ్చుకున్నాం. అంత బాగానే ఉన్నా ఓ వ్యక్తి చేసిన పనికి దేశం ఆగ్రహంతో ఊగిపోతోంది. వాడు చేసిన పనికి మండిపడుతుంది. ఇంతకీ వాడు ఏం చేశాడంటే.. మన ప్రాణమైన జాతీయ జెండాతో బండి తుడిచాడు.
భూమి పై భారం
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మేజర్ సురేంద్ర పునియా ట్విట్టర్ లో పోస్టు చేశాడు. ఈ వీడియోతో పాటు త్రివర్ణ పతాకాన్ని, తల్లిని గౌరవించని వాడు భూమిపై భారం.. వారి కంటే పల్లెటూరి గుడిసెలో బతుకుతున్న చిన్న పిల్లలే త్రివర్ణ పతాకాన్ని తలపై పెట్టుకుని జీవించే ఉత్తమ పౌరులు! అంటూ రాశారు.
Shameless & Disgraceful 💔
— Major Surendra Poonia (@MajorPoonia) September 8, 2022
जिसको तिरंगे और माँ की कद्र नहीं वो धरती पर बोझ है ..इनसे अच्छे नागरिक वो छोटे छोटे बच्चे हैं जो गाँव की झोंपड़ी में रहते हैं पर तिरंगा सर पर रखते हैं !@DelhiPolice This man should be behind bars 🙏 Jai Hind 🇮🇳 pic.twitter.com/7Q3v7n2X9r

వాడిని శిక్షించాలి
అలాగే ఈ వ్యక్తి కటకటాల్లో ఉండాలని ఢిల్లీపోలీసులను ట్యాగ్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అతడిని పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications