Viral Video: ఏనుగు చేసిన పని చూస్తే వావ్ అనాల్సిందే..
మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యం ఏనుగుకు సంబంధించిన వీడియోలు చాలా మంది ఇష్టపడతారు. తాజాగా ఏనుగుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఏనుగు రెస్పన్సిబుల్ రోల్ పోషించింది.
Recommended Video
సాధారణంగా వాహనదారులు ఇష్టమున్న చోట పార్కింగ్ చేస్తుంటారు. అక్కడ నో పార్కింగ్ బోర్డు ఉన్నా కూడా వాహనాలు పార్క్ చేస్తారు. ఇలా ఓ చోట బైక్ ను పార్కింగ్ చేశారు. అయితే అటుగా వెళ్తున్న ఏనుగు నో పార్కింగ్ లో బైక్ పార్కింగ్ చేశాడని బైక్ ను కింద పడగొట్టింది. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న షాపులోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుసంత నందా పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయిన వీడియో పోస్ట్ చేయడంతో పాటు "Don't park in no parking zone. Original owner of the land enforcing traffic rules at night." అని రాసుకొచ్చారు. ఈవీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు.
Don’t park in no parking zone. Original owner of the land enforcing traffic rules at night.
— Susanta Nanda IFS (@susantananda3) August 30, 2022
VC:NDTV pic.twitter.com/F1UGg9N43Z












Click it and Unblock the Notifications