శశికళకు పన్నీర్ సెల్వం పాదాభివందనం: వైరల్ వీడియో
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శశికళ కాళ్ల మీద పడిపోయి ఆశీర్వాదం తీసుకోవడంతో ఓ నాయకుడు దానిని మొబైల్ లో వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శశికళను అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో కలవడానికి వెళ్లిన సమయంలో ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. శశికళ కాళ్ల మీద పడిపోయి సీఎంఆశీర్వాదం తీసుకోవడంతో ఓ నాయకుడు దానిని మొబైల్ లో వీడియో చిత్రీకరించారు.
జయకు చికిత్స ఇలా చేశారు: కేంద్రానికి లేఖ రాసిన గవర్నర్
அதிமுக ஆபீசில் சசி காலிலும் விழுந்த முதல்வர் ஓபிஎஸ்- வைரலாகும் வீடியோ! https://t.co/tjjaqDC3K2 #sasikala #OPanneerselvam pic.twitter.com/cUI0HFBSVj
— Oneindia Tamil (@thatsTamil) January 3, 2017
ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. అన్నాడీఎంకే నాయకులు ఒక్క జయలలితకు తప్పా ఇంత వరకు ఎవ్వరికి పాదాభివందనం చెయ్యలేదు. జయలలిత మరణించిన తరువాత చిన్నమ్మకు అందరూ పాదాభివందనం చేస్తున్నారు.

పన్నీర్ సెల్వం మాత్రం ఇప్పటి వరకు శశికళకు పాదాభివందనం చెయ్యలేదని నాయకులు అంటున్నారు. అయితే అన్నాడీఎంకే చీఫ్ గా శశికళ బాధ్యతలు స్వీకరించిన తరువాత పన్నీర్ సెల్వం చిన్నమ్మ శశికళకు పాదాభివందనం చేశారని వెలుగు చూసింది.

మీకో దండం: పన్నీర్ సెల్వం రాజీనామా ? శశికళ చేతిలో లేఖ
జయలలిత తరువాత పార్టీలో అంతా తానై నడిపిస్తున్న శశికళ ఇప్పుడు అమ్మకు ఇచ్చే అన్ని మర్యాదలు తనకు ఇవ్వాలని పరోక్షంగా తన అనుచరులకు చెప్పడంతో వారు అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలకు చిన్నమ్మకు పాదాభివందనం చెయ్యాలని సూచనలు ఇస్తున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications