అవినీతి ఆరోపణల కేసులో కాగ్నిజంట్: ఐటీ పరిశ్రమపై ప్రభావం!
ముంబై: న్యూజర్సీ కేంద్రంగా పనిచేస్తూ ప్రపంచ వ్యాప్తంగా వివిధ నగరాల్లో ఐటీ సేవలందిస్తున్న కాగ్నిజంట్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ భారత ఐటీ రంగాన్ని కుదిపేసింది. ఇందులో భాగంగా జనవరి నుంచి రెండుసార్లు కాగ్నిజంట్ తన అభివృద్ధి రేటు అంచనాలను తగ్గించుకుంది.
ఇక అమెరికన్ మార్కెట్‌లో నాస్ డాక్ సూచీ కింద లిస్టింగ్ అవుతున్న కాగ్నిజంట్, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 15 శాతం వరకూ ఆదాయాన్ని కోల్పోనుందని, ఇది 1997 తర్వాత నమోదు కానున్న అతి తక్కువ వృద్ధి రేటని నిపుణులు వ్యాఖ్యానించారు.

అయితే కాగ్నిజంట్‌తో పాటు, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి పలు ఐటీ కంపెనీలు ఇప్పటికే తమ ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గించుకుని ప్రకటించాయి. ఇక భారత్‌లో వివిధ ప్రాంతాల్లో కాగ్నిజంట్ తన ఆఫీసులను నెలకొల్పేందుకు అధికారులకు లంచాలను ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో యూఎస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ విభాగం విచారణ ప్రారంభించగా, ఆ ఒక్క రోజునే కాగ్నిజంట్ 13 శాతం నష్టపోగా, దాదాపు రూ. 28 వేల కోట్ల విలువైన ఇన్వెస్టర్ల సంపద హారతి అయింది. ఇదే సమయంలో కాగ్నిజంట్ ప్రధాన పోటీ సంస్థలైన ఇన్ఫోసిస్, టీసీఎస్‌లలో సైతం వివాదాలు తలెత్తాయి.
వాణిజ్య రహస్యాలు బయటకు చెప్పడం, ఐపీ వయోలేషన్స్‌కు సంస్థలు పాల్పడటం వంటి కేసులు ఈ కంపెనీలను కూడా ఇరుకున పెట్టాయి. భారత ఐటీ కంపెనీలకు ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న బీఎఫ్ఎస్ఐ విభాగానికి సంబంధించిన వచ్చిన ఆరోపణలు ఐటీ కంపెనీలను ఇబ్బందులు పెడుతున్నాయి.
దీంతో గడచిన త్రైమాసికంతో పోలిస్తే 1.5 శాతం వరకూ ఈ సంస్థల ఆదాయం తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఏడాది 10 నుంచి 12 శాతం వరకూ ఐటీ పరిశ్రమ వృద్ధి రేటు తగ్గనుందని నాస్కామ్ అంచనా వేసింది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు కూడా భారత ఐటీ రంగంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications