Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేయ్ మ్యారేజ్ డే మరిచిపోతావా?, అర్దరాత్రి భర్తను పొడిచిపారేసిన భార్య, టెక్ కారిడార్ లో కలకలం!

వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యకు బహుమతి ఇవ్వడం మర్చిపోయినందుకు భర్త ఇప్పుడు ఆసుపత్రిలో చేరాడు. గిఫ్ట్ కోసం మొదలైన గొడవ తరువాత ఆసుపత్రి, పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. తనకు విలువైన గిఫ్ట్ ఇవ్వలేదన్న కోపంతో గొడవపడిన మహిళ ఆమె భర్తను కత్తితో పొడిచి చంపాలని ప్రయత్నించడం కలకలం రేపింది. బెంగళూరు మహిళపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది.

బెంగుళూరులోని టెక్ కారిడార్‌లో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బెంగళూరులోని టెక్ కారిడార్ ప్రాంతంలో కిరణ్ (37), సంధ్యా (35) దంపతులు నివాసం ఉంటున్నారు. కిరణ్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల పెళ్లిరోజు సందర్బంగా తనకు విలువైన బహుమతి ఇవ్వలేదని కోపంతో కిరణ్ తో గొడవపడిన అతని భార్య సంధ్యా చివరికి నిద్రిస్తున్న భర్తను కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు.

A wife stabbed her husband late in the night in Bengaluru for not giving him a valuable gift on the marriage day

వివాహ వార్షికోత్సవం రోజు తనకు విలువైన బహుమతి వస్తుందని సంధ్యా ఆశపడింది. ఫిబ్రవరి 27వ తేదీన కిరణ్, సంధ్యా దంపతుల పెళ్లిరోజు అని తెలిసింది. అయితే కిరణ్ మాత్రం పెళ్లి రోజు సందర్బంగా అతని భార్య సంధ్యాకు ఎలాంటి బహుమతి ఇవ్వకుండా సైలెంట్ గా ఉండిపోయాడు. ఇదే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వివాహ వార్షికోత్సవం సందర్బంగా తనకు ఎందుకు గిఫ్ట్ ఇవ్వలేదని సంధ్యా ఆమె భర్త కిరణ్ తో పెద్దగా గొడవ చేసింది.

గిఫ్ట్ రాకపోవడంతో మనస్తాపానికి గురైన సంధ్యా ఆమె భర్త కిరణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాత్రి భర్త కిరణ్ నిద్రిస్తున్న సమయంలో కత్తితో పొడిచిన సంధ్యా అతన్ని చంపడానికి ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. ఇటీవలే కిరణ్‌ తాత చనిపోవడంతో అతని భార్య సంధ్యాకు బహుమతి ఇవ్వలేకపోయాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మ్యారేజ్ డే సందర్బంగా విలువైన బహుమతి ఇంటికి రాలేదని నిరాశతో సంధ్యా ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం.

అర్దరాత్రి బెడ్ రూమ్ లో నిద్రపోతున్న భర్త కిరణ్ మీద అతని భార్య కత్తితో దాడి చేసి చంపడానికి ప్రయత్నించిందని తెలిసింది. ఆ సమయంలో గాయాలు అయినప్పటికీ కిరణ్ అతన్ని అతను రక్షించుకుని భార్య సంధ్యా దాడి నుంచి తప్పించుకుని ఇంటి నుంచి బయటకు పరుగుతీసి ఇరుగుపొరుగు వారి సహాయంతో ఆసుపత్రికి వెళ్లి అక్కడ వైద్య సహాయం పొందాడు. కిరణ్ తో పాటు ఇరుగుపొరుగు వారు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఆసుపత్రి నుండి వచ్చిన నివేదికతో పాటు న్యాయనిపుణుల సలహా తీసుకున్న బెంగళూరులోని బెళ్లందూర్ పోలీసులు సంధ్యాపై అధికారికంగా ఛార్జ్ షీట్ నమోదు చేశారు. కిరణ్, సంధ్యా దంపతుల గొడవలకు సంబంధించి కుటుంబ గొడవలు అనే స్వభావాన్ని అంగీకరిస్తున్నప్పటికీ పోలీసులు కేసు తీవ్రతను నొక్కిచెప్పారు, సమగ్ర దర్యాప్తు జరుగుతోందని బెంగళూరు పోలీసు అధికారులు చెప్పారు.

వ్యక్తిగతంగా సంధ్యా మానసిక ఒత్తిడికి లోనైయ్యిందని, తన భర్త తను బహుమతి ఇవ్వలేదనే కోపంతో అలా చేసి ఉంటుందని పోలీసులు తెలిపారు. అయితే తన భార్య సంధ్యాకు కౌన్సిలింగ్ నిర్వహించాలని కిరణ్ స్వయంగా పోలీసులకు మనవి చేశారు. కేసు విచారణలో ఉంది. మొత్తం మీద మ్యారేజ్ డేకి విలువైన బహుమతి ఇవ్వలేదనే కోపంతో అర్దరాత్రి బెడ్ రూమ్ లో భార్య ఆమె భర్తను కత్తితో పొడిచిన ఘటన బెంగళూరులో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+