షాక్: పీఎస్‌లోనే జడ్జీనంటూ ఎస్ఐ లెంపలు వాయించింది(వీడియో)

Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. తాను న్యాయమూర్తినంటూ ఓ మహిళ.. ఏకంగా ఎస్ఐపైనే దాడి చేసింది. పోలీస్ స్టేషన్‌లోకి చొరబడి తన కుమారుడినే అరెస్ట్ చేస్తారా? అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

దాడి చేసిన మహిళను జయాపాఠక్‌గా గుర్తించారు. ప్రస్తుతం ఈ దాడి వీడియో వైరల్‌గా మారింది. డెహ్రాడూన్‌లోని ప్రేమ్ నగర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.

ఆ వివరాల్లోకి వెళితే.. ఇక్కడి ఓ ప్రైవేటు యూనివర్సిటీలో చదువుతున్న ఆమె కుమారుడు, మరికొందరితో ఘర్షణకు దిగాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులందర్నీ అరెస్ట్ చేసి వారి తల్లిదండ్రులను పిలిపించారు పోలీసులు. దీంతో స్టేషన్ కు వచ్చిన జయాపాఠక్ పోలీసులతో గొడవకు దిగారు.

తాను యూపీలో జిల్లా అడిషనల్ న్యాయమూర్తినంటూ రెచ్చిపోయారు. ఆమె దూషణ పర్వాన్ని వీడియో తీయబోగా.. ఎస్ఐపైనా దాడి చేశారు. దీంతో 'మీరు న్యాయమూర్తినని చెబుతున్నారు. ఇలా ప్రవర్తించడం భావ్యమేనా? మీపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది' అని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆమెను గట్టిగా హెచ్చరించారు.

ఈ వ్యవహారాన్ని జనరల్ డైరీలో రాసిన పోలీసులు.. ఆమె జడ్జీగా పనిచేస్తున్నారా? లేదా ? అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. అదే నిజమైతే అలహాబాద్ హైకోర్టు అనుమతితో కేసు నమోదు చేస్తామని, తప్పని తేలితే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Woman allegedly Beaten a Police sub Inspector in Dehradun.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X