Love: ప్రియుడి కోసం పోలాండ్ నుంచి కూతురుతో సహా వచ్చిన మహిళ..
ప్రేమకు గుడ్డిదని అంటారు.. దానికి వయస్సుతో కానీ.. మతంతో కానీ దేశంతో కానీ సంబంధం లేదంటారు. కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్ కు చెందిన సీమా హైదర్ అనే వివాహిత పబ్ జి ద్వారా పరిచయమైన భారత్ కు చెందిన వ్యక్తి కోసం ఆమె తన కుటుంబ సభ్యులను విడిచిపెట్టి వచ్చింది. తాజాగా పోలాండ్ చెందిన ఓ మహిళ తన ప్రియుడి కోసం బిడ్డతో పాటు భారత్ కు వచ్చింది.
పోలాండ్‌కు చెందిన 49 ఏళ్ల పోలాక్ బార్బరాకు జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లా ఖుత్రాకు చెందిన మహ్మద్ షాదాబ్ కు 2021లో ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. వీరు కొద్దరు ఆన్ లైన్ లో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో పోలాక్ తన ఆరేళ్ల కూతురుతో కలిసి 2027 వరకు చెల్లుబాటు అయ్యే టూరిస్త్ వీసాపై భారత్ కు వచ్చింది. ప్రస్తుతం పోలాక్ బార్బరా, మహ్మద్ షాదాబ్ కలిసే జీవిస్తున్నారు.

వారు హజారీబాగ్ SDM కోర్టులో వివాహం కోసం దరఖాస్తు చేసుకున్నారు. పోలాక్ బార్బరా తన భర్తతో కొద్ది రోజుల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. భారత్‌కు వచ్చిన తర్వాత పోలాక్ తనను కలిసిందని, కొన్ని రోజులు హోటల్‌లో బస చేశానని షాదాబ్ చెప్పాడు. ఆ తర్వాత ఆమె ఖుత్రాకు వెళ్తామని చెప్పందని వివరించాడు. అయితే ఖుత్రాలో అధిక వేడి కారణంగా పోలాక్ ఇబ్బంది పడినట్లు షాదాబ్ పేర్కొన్నాడు. పోలాక్ కోసం రెండు ఏసీలు పెట్టించవల్సి వచ్చిందన్నాడు.
పోలాక్ బార్బరా కోసం షాదాబ్ కొత్త టీవీ కూడా కొనుగోలు చేశాడు. పోలాక్ షాదాబ్ కుటుంబానికి ఇంటి పనుల్లో సహాయం చేస్తున్నారు. ఆమె గ్లౌజ్ ధరించి ఆవు పేడ, చెత్తను శుభ్రం చేస్తుంది. తనకు భారతదేశం, హజారీబాగ్ అంటే చాలా ఇష్టమని, అయితే రద్దీగా ఉండే ప్రదేశాలను సందర్శించడం తనకు ఇష్టం లేదని చెప్పింది. విదేశీ మహిళా గ్రామానికి చేరుకుందన్న వార్త తెలియగానే హజారీబాగ్ హెడ్‌క్వార్టర్స్ డీఎస్పీ రాజీవ్ కుమార్, ఇన్‌స్పెక్టర్ అభిషేక్ కుమార్ గ్రామాన్ని సందర్శించి పోలాక్‌తో మాట్లాడారు. ఆమె తన వీసాను పోలీసు అధికారులకు చూపించి, మరికొద్ది రోజుల్లో తన దేశానికి తిరిగి వస్తానని చెప్పింది.












Click it and Unblock the Notifications