Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భర్త అక్రమ సంబంధం, లైవ్ లో వీడియో తీసిన భార్య ఏం చేసిందంటే ?

యువతి, యువకుడి పెళ్లి చెయ్యాలని పెద్దలు నిర్ణయించారు. పెళ్లికూడా గ్రాండ్ గానే జరిగింది. వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చెయ్యడంతో సంవత్సరం తరువాత లక్షణమైన అమ్మాయి పుట్టింది. నాలు సంవత్సరాలు పాటు దంపతుల కాపురం చాలా సవ్యంగా, సంతోషంగా సాగిపోయింది. తర్వాత దంపతుల మధ్య ఓ మహిళ ఎంట్రీ ఇవ్వడంతో వారి కాపురంలో చిచ్చురేపింది.

తన భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందంటూ ఓ భార్య లైవ్ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఐటీ హబ్ లోని బెంగళూరు నగరంలోని బ్యాడరహళ్లిలో చోటుచేసుకుంది. మానస(25) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. మానసకి దిలీప్‌తో ఆరు ఏళ్ల క్రితం వివాహమైంది. మానస కుటుంబ సభ్యులు గ్రాండ్ గా పెళ్లి చేశారు. మానస, దిలీప్ దంపతులకు ఐదు ఏళ్ల కుమార్తె ఉంది. భార్య, కుమార్తెలో దిలీప్ చాలా సంతోషంగా ఉండేవాడని బందువులు అంటున్నారు.

A woman committed suicide while speaking live about an illicit relationship

అయితే దిలీప్ బెంగళూరులోనే వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్న మరో మహిళతో ఏడాదిన్నరగా సహజీవనం సాగిస్తున్నాడని సమాచారం. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. మానస ఆమె భర్త దిలీప్ అక్రమ సంబందం గురించి ఆమె పుట్టింటి వాళ్లకు సమాచారం ఇచ్చింది. అల్లుడు దిలీప్ అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న మానప కుటుంబ సభ్యులు అతని ఇంటికి వెళ్లి బుద్దిమాటలు చెప్పి పద్దతి మార్చుకోవాలని, నీకు ఓ కుమార్తె ఉందని నచ్చచెప్పారు.

అయితే దిలీప్ మాత్రం అతని ప్రియురాలిని వదిలిపెట్టడానికి అంగీకరించలేదని, ఆమెతోను ఎక్కువగా కాలం గడిపేవాడని తెలిసింది.

దీంతో విసిగిపోయిన మానస ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. బెంగళూరులోని ఆంధ్రాహళ్లి తన భర్త దిలీప్ ఇంట్లోనే మానస ఉంది. ఆదివారం రాత్రి మానస ఆమె మొబైల్ ఫోన్ ఆన్ చేసి లైవ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటన తర్వాత మానస కుటుంబ సభ్యులు దిలీప్ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దిలీప్ వేధింపుల వల్లే మానస ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.
విషయం తెలుసుకున్న మానస కుటుంబ సభ్యులు బెంగళూరు నగరంలోని బ్యాడరహళ్లి పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లి భర్త దిలీప్ ను నిలదీశారు. తరువాత సహనం కోల్పోయిన మానస బందువులు దిలీప్ పై దాడికి పాల్పడ్డారు.

మానస మృతదేహాన్ని బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రి మార్చురీకి తరలించిన బ్యాడరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. భర్త దిలీప్ అక్రమ సంబంధం కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని మానస లైవ్ లో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+