Metro: ఢిల్లీ మెట్రోలో దారుణం.. చీర డోర్‍లో ఇరుక్కుని మహిళ మృతి..
మనం ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తాజాగా ఢిల్లీలోని ఇందర్‌లోక్ స్టేషన్‌లో దారుణం జరిగింది. మహిళ చీర మెట్రో ట్రైన్ డోర్ లో ఇరుక్కోవడంతో ట్రాక్ పడింది. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. గురువారం ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన మహిళను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించగా.. డిసెంబర్ 16న ఆమె మృతి చెందినట్లు తెలిసింది. ఆమె మెట్రో ఎక్కిందా లేదా దిగిందా అన్న విషయం మాత్రం ఇంకా అస్పష్టంగానే కనిపిస్తోంది.
మహిళను రీనగా గుర్తించారు. మహిళ బంధువు విక్కీ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయ్ నుంచి మోహన్ నగర్‌కు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఆమె భర్త ఏడేళ్ల క్రితమే చనిపోయాడని, ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. "గురువారం ఇందర్‌లోక్ మెట్రో స్టేషన్‌లో ఒక సంఘటన జరిగింది. ఇక్కడ ఒక మహిళా ప్రయాణికురాలి బట్టలు రైలులో చిక్కుకుపోయి గాయాలయ్యాయి. తరువాత ఆసుపత్రిలో శనివారం మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది" అని ఢిల్లీ మెట్రో చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అనూజ్ దయాల్ తెలిపారు.

ఈ ఘటనపై మెట్రో రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ జరుపుతారని దయాల్ తెలిపారు. "పోలీసులు దీనిని పరిశీలిస్తున్నారు. అవసరమైతే, న్యాయపరమైన అభిప్రాయం తీసుకోబడుతుంది" అని అధికారి తెలిపారు. గురువారం రీన తన కుమారుడితో కలిసి ఇందర్ లోక్ మెట్రో స్టేషన్ రైలు జనరల్ కంపార్ట్ మెంట్ ఎక్కారు. తన కొడుకుని తీసుకురావడానికి ప్రయత్నించగా ఆమె చీర మెట్రో డోర్ ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది.
రైలు అలాగే ఆమెను దాదాపు 25మీటర్ల వరకు లాక్కెళ్లింది. ఆ తర్వాత ఆమె ట్రాక్ పై పడింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలు కాగా.. ఆమె కొడుకు అక్కడే ప్లాట్ ఫారమ్ పై ఉండిపోయాడు. ఏడేళ్ల క్రితం తండ్రి, ఇప్పుడు తల్లి మరణించడంతో కూతురు, కుమారుడు అనాథగా మిగిలారు.












Click it and Unblock the Notifications