బాయ్ ఫ్రెండ్ ఎదుటే దారుణం... మద్యం మత్తులో ప్రియురాలిపై గ్యాంగ్ రేప్

కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ నగరంలో దారుణం జరిగింది. ఓ అమ్మాయిని తన బాయ్‌ఫ్రెండ్ ఉండగానే బలవంతంగా గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన మైసూర్ లో సంచలనం రేపుతోంది. ఒక్కరు ఇద్దరు కాదు మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు యువతిని రేప్ చేసి, ఆమే బాయ్ ఫ్రెండ్ పై దాడి చేశారు. యువతి రేప్ సంఘటన మైసుర్‌లో సంచలనం కావడంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.

కర్ణాటకలోని మైసూర్ నగర శివారులోని లింగాంబుధి పాల్కా దగ్గర ఈ సంఘటన జరిగింది. మైసూర్ లోని ఓ లాడ్జీలో పని చేస్తున్న శివసిద్దప్ప అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతి ఫేస్ బుక్ లో పరిచమయ్యారు. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈనేపథ్యంలోనే లాడ్డీలో విధులు ముగించుకున్నఅనంతరం ఇద్దరు కలసి బైక్ పై తమ ఇంటికి వెళుతుంటారు. గత బుధవారం రాత్రి కూడ విధులు ముగించుకుని తమ ఇంటికి వెళుతున్నారు .ఈనేపథ్యంలోనే తమ ప్రాంతమైన లింగాంబుధికి చేరుకోవడంతో కారులో వెళ్తున్న ఆరుగురు యువకులు వారిని అడ్డుకున్నారు. కారును అడ్డంగా పెట్టారు. దీంతో బైక్ ను ఆపివేశారు శివసిద్దప్ప

a woman gang raped infront his boy friend

కారులోనే మద్యం తాగతూ వెళుతున్న ముగ్గురు యువకులు కారులో నుండి మద్యం బాటిల్లతోనే బయటకు వచ్చారు. కారు దిగిన వెంటనే బైక్ పై ఉన్న యువతిని పట్టుకుని రోడ్డుపక్కనే ఉన్న ముళ్ల పొదల్లోకి గుంజుకెళ్లారు. ఇదంతా చూస్తున్న ప్రియుడు వారిని అడ్డగించారు. దీంతో వాళ్లు ముగ్గురు ఉండడంతో శివసిద్దప్పను అక్కడే ఉన్న బండరాయితో తలను పగులగొట్టారు. అనంతరం యువతిపై దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన తర్వాత ఇద్దరిని వదిలివేసి వెళ్లిపోయారు.

దీంతో నిస్సహాయ స్థితిలో ఉన్న వారు పోలీసులకు ఫోన్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసును బుక్ చేసుకుని విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా మైసూర్ నగరశివారులో ఈ సంఘటన జరగడంతో పెద్ద ఎత్తున ప్రజలనుండి ఆందోళన వస్తుంది. దీంతో నిందితులను పట్టుకునేందుకు ఎనిమిది బృందాలుగా పోలీసులు వెతుకుతున్నారు. అయితే సంఘటన స్థలం అంతా చీకటీగా ఉండడంతో కారు నెంబర్ పై స్పష్టత రాకపోవడంతో నిందితుల మొబైల్ ఫోన్ల ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+