బాయ్ ఫ్రెండ్ తో కలిసి కొడుకును కిడ్నాప్ చేసిన కన్నింగ్ లేడీ, భర్త దెబ్బకు షాక్
వివాహం చేసుకున్న దంపతులకు సంతోషంా కాపురం చేశారు. విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో ఓ కుమారుడు పుట్టాడు. అయితే దంపతుల మధ్య తేడాలు వచ్చాయి. చివరికి దంపతులు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టులో విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో దంపతుల కుమారుడు కిడ్నాప్ కావడం కలకలం రేపింది.
కుటుంబ కలహాల కారణంగా బాయ్ ఫ్రెండ్ తో కన్న తల్లి తన బిడ్డను కిడ్నాప్ చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. కిడ్నాప్ దృశ్యం సీసీటీవీలో రికార్డయింది. ఈ ఘటన బెంగళూరులోని కేఆర్ పురంలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త సిద్ధార్థ అతని భార్య అనుప మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మాయం అయిన బిడ్డ కోసం గాలిస్తున్నారు.

2014లో అనుపమ, సిద్దార్థ్ పెళ్లి చేసుకున్నారు. వివాహం చేసుకున్న తరువాత అనుపమ ఆమె భర్త సిద్దార్థ్ తో కలిసి చాలా సంతోషంగా ఉండేదని వారి బంధువులు చెప్పారు. అయితే రానురాను అనుపమ, సిద్దార్థ్ లమ ద్య గొడవలు మొదలైనాయి, అనుపమ మీద ఆమె భర్త ఆరోపణలు చెయ్యడం, సిద్దార్థ్ మీద అతని భార్య ఆరోపణలు చెయ్యడం మొదలైనాయి. చివరికి ఇరువైపుల కుటుంబ సభ్యులు రాజీ పంచాయితీలు చేసి విసిగిపోయారు.
చివరికి అనుపమ, సిద్ధార్థ్‌ల మధ్య కుటుంబ కలహాలు ఎక్కువ కావడంతో ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు. కోర్టులో విచారణ జరుగుతోంది.
చిన్నారికి ఆరున్నరేళ్లు కాగా, ఆ బిడ్డను ఆమె భర్త సిద్ధార్థకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. పాఠశాలకు వెళ్లేందుకు అపార్ట్‌మెంట్ ముందు నిల్చున్న బిడ్డను తల్లి అనుపమ, ఆమె బాయ్ ఫ్రెండ్ కలిసి కిడ్నాప్ చేశారు.
ఈరోజు ఉదయం చిన్నారిని స్కూల్‌లో దించేందుకు సిద్దార్థ్ తండ్రి రాగా మనవడు ఓ ప్రైవేట్ అపార్ట్‌మెంట్ ముందు కిడ్నాప్‌కు గురైనాడని తెలుసుకున్ని కుమారుడికి సమాచారం ఇచ్చాడు. సిద్దార్థ్ ఫిర్యాదు చెయ్యడంతో కేఆర్ పుర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి చిన్నారి ఆమె తల్లి అనుపమ, ఆమె బాయ్ ఫ్రెండ్ కోసం గ పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications