Lady: భర్త బయటకు వెళ్లాడు, పట్టపగలు మాస్క్ లు వేసుకుని వెళ్లి భార్య గొంతు చీల్చి చంపేశారు !
బెంగళూరు/హాసన్: శత్రుత్వం కోసం హత్యలు చేసి తమ జీవితాలను నాశనం చేసి జైలుకు వెళ్లిన ఉదాహరణలు మనం చాలా చూశాము. కళ్లముందే ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. కోపంతో హత్యలు చేసిన వారు సమాజంలో హాయిగా జీవించలేక జైల్లో ఉంటున్నారు. శత్రుత్వం, డబ్బు కోసం హత్యలు జరుగుతున్న ఘటనలు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భర్త బయటకు వెళ్లిన తరువాత ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను అతిదారుణంగా హత్య చేసి పరారైనారు. పట్టపగలు మహిళ హత్యకు గురికావడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోతున్నారు.

పట్టపగలు దారుణ హత్య
శనివారం పట్టపగలు ఇద్దరు దుండగులు ఓ మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లా హోలేనరసీపుర తాలూకాలోని గంగూరు గ్రామంలో జరిగింది. భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లి తరువాత ఇంట్లోకి చొరబడిన నిందితులు మహిళ గొంతు కోసి ఆమెను దారుణంగా చంపేశారు. పార్వతమ్మ (55) అనే మహిళ శనివారం దారుణ హత్యకు గురైయ్యింది.

భర్త బయటకు వెళ్లాడని తెలుసుకుని ?
పార్వతమ్మ శనివారం ఉదయం 10 గంటలకు ఇంట్లో ఉన్న సమయంలో ఆమెను చంపేశారు. పార్వతమ్మ భర్త రాజేగౌడ శనివారం ఉదయం 9 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడని తెలిసింది. రాజేగౌడ ఇంట్లో లేడని నిర్దారించుకున్న నిందితులు ఆయన ఇంటికి వెళ్లి పార్వతమ్మను హత్య చేసి పరారయ్యారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న పార్వతమ్మను అతి దారుణంగా హత్య చేసి దర్జాగా పరారయ్యారు.

మహిళ వెళ్లి చూస్తే మ్యాటర్ తెలిసింది
గంట తరువాత పార్వతమ్మ బంధువు ఇంటికి వెళ్లి చూడగా ఆమె హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. అయితే పార్వతమ్మను ఎవరు హత్య చేశారనే దానిపై ఎలాంటి క్లూ చిక్కలేదని పోలీసులు అంటున్నారు. గ్రామంలోకి బైక్ లో వచ్చిన ఇద్దరు ముఖానికి మాస్కులు ధరించారని స్థానికులు పోలీసులకు చెప్పారు. పార్వతమ్మను హత్య చేసిన న ప్రదేశం నుంచి బైక్ లో మాస్క్ లు వేసుకుని ఇద్దరు వస్తున్న విషయం చూసిన గ్రామస్తులు వాళ్లే హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకు హత్య చేశారు ?
పార్వతమ్మను హత్య చేసిన కొంత సేపటికే ఆఇంటి వైపు నుంచి ఇద్దరు వ్యక్తులు మాస్క్‌లు వేసుకుని బైక్ లో వేగంగా వెళ్లిపోయారని ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేసి వివరాలు సేకరించారు. హోలేనరసీపర గ్రామీణ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. అయితే పార్వతమ్మను ఎవరు హత్య చేశారు ? అని ఇంత వరకు పక్కా సమాచారం తెలియడం లేదని పోలీసులు అంటున్నారు.

హడలిపోయిన ప్రజలు
ఇదే నెలలో హసన్ జిల్లా హోలేనరసీపుర తాలూకా దొడ్డహళ్లి గ్రామంలో కోడలిపై కన్నేసిన మామను హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తిని తమ్మన గౌడ (54)గా గుర్తించారు. రాగికావలు గ్రామం హోసకెరెలో తమ్మన్నగౌడ్ మృతదేహం లభ్యమైంది. తమ్మన్న మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్‌తో కప్పి చెరువులో పడేశారు. మృతుడి కుమారుడు కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో కోడలి విషయంలో హత్య జరిగిందని వెలుగు చూసింది. తాలుకాలో వరుస హత్యలు జరగడంతో స్థానిక ప్రజలు హడలిపోయారు. పార్వతమ్మ హత్య మిస్టరీగా మారింది.












Click it and Unblock the Notifications