దారుణం: నిద్రిస్తున్న మహిళా సన్యాసినిపై గ్యాంగ్‌రేప్

Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తప్రదేశ్‌లోని మధురలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆలయంలో నిద్రిస్తున్న ఓ సన్యాసినిపై సామూహిక అత్యారానికి పాల్పడ్డారు దుండగులు. సెప్టెంబర్ 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 11 రాత్రి ఓ సన్యాసిని (45) బార్సనాలోని శ్రీజీ ఆలయ ఆవరణలో నిద్రిస్తుండగా వాచ్‌మెన్‌తో పాటు ఆలయ సిబ్బంది ఒకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

A woman saint allegedly gangraped in Mathura in Uttar Pradesh.

ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి ఇష్టపడని బాధితురాలు స్థానిక విలేఖరి ద్వారా పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో పోలీసులు 13వ తేదీన కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుల ఆచూకీ కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు మధుర గ్రామీణ ఎస్సీ ఆదిత్యకుమార్‌ శుక్లా తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman saint allegedly gangraped in Mathura in Uttar Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి