భర్తను ఇస్తే రూ.10లక్షలు ఇస్తా: భార్యతో యువతి బేరం
చెన్నై: తను ప్రేమించిన వ్యక్తిని దక్కించుకునేందుకు ఓ యువతి అతడ్ని కొనేందుకు అతడి భార్యతోనే బేరమాడింది. ‘రూ. 10లక్షలు ఇస్తాను. నీ భర్తను నాకిచ్చేయి' అని ఆమెతో బేరమాడింది. ఈ ఘటన తమిళనాడులోని చెన్నై నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మధురై తిరుమంగళం చెందిన నాగరాజ్, వినోదిని(23) భార్యాభర్తలు. కాగా, తిరుప్పరంగుండ్రం చెందిన పేచ్చియమ్మాళ్ అలియాస్ సత్యా(23) మధురై హోంగార్డు విభాగంలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో నాగరాజ్‌కు, పేచ్చియమ్మాళ్‌తో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది.

నాగరాజ్, పేచ్చియమ్మాళ్ ఇద్దరూ విడిగా ఉంటూ సహజీవనం చేస్తున్నారు. కాగా, ఈ విషయం నాగరాజ్ భార్య వినోదినికి తెలిసింది. దీంతో వినోదినికి, పేచ్చియమ్మాళ్ మధ్య గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో రూ. 10 లక్షలు ఇస్తానని, నాగరాజ్‌ను తనకు విడిచిపెట్టాలని వినోదినిని కోరింది పేచ్చియమ్మాళ్.
ఇందుకు పేచ్చియమ్మాళ్ తండ్రి వనమామలై, తల్లి పాండియమ్మాల్‌కు కూడా సహకరించారు. ఇందుకు అంగీకరించకపోవడంతో వీరందరూ కలిసి వినోదినిని ఇంటికెళ్లి ఆమెపై దాడి చేశారు. దీంతో వినోదిని పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications