మునిసిపాలిటి అధ్యక్షుడి భార్య ఆత్మహత్య, అదే కారణం అంటున్న కుటుంబ సభ్యులు !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: జీవితంపై విరక్తి చెందిన మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో జరిగింది. చిత్ర దుర్గ పురసభ అధ్యక్షుడు (మునిసిపల్ చైర్మెన్) భార్య హేమావతి (50) అనే మహిళ ఆత్మహత్య చేసుకున్నారు.

చిత్రదుర్గ జిల్లా హోసదుర్గ తాలుకాలోని కల్లేశ్వర లేఔట్ లో హేమావతి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. శనివారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

A woman who is a wife of president of municipality from Kalleshwar layout in Karnataka.

మూడు నెలల క్రితం హేమావతి సోదరి మరణించారు. హేమావతికి ఆమె సోదరి అంటే ఎంతో ప్రాణం. సోదరి చనిపోయిన విషయం జీర్ణించుకోలేకపోయిన హేమావతి ఆందోళనకు గురైనారని సమాచారం. అప్పటి నుంచి ఎవ్వరితో కలవకుండా ఎక్కువగా ఒంటరి జీవితం గడుపుతున్న హేమావతి శనివారం ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని హోసదుర్గ పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman who is a wife of president of municipality from Kalleshwar layout, Hosadurga taluk, Chitradurga commits suicide. She was suffering from depression, sources said.
Please Wait while comments are loading...