వరకట్నం తీసుకురాలేదని ఏడాది నుంచి నో ఫస్ట్ నైట్: కేసు పెట్టింది !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: వరకట్నం తీసుకురాలేదని భార్యను మొదటి రాత్రి శుభకార్యానికి (ఫస్ట్ నైట్ ) దూరం పెట్టి ఒక ఏడాతా నుంచి చిత్రహింసలకు గురి చేసిన వ్యక్తి మీద భార్య ఫిర్యాదు చెయ్యడంతో బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

వరకట్నం తీసుకు వచ్చే వరకు తన బెడ్ రూంలోకి రాకూడదని, తనతో సంసారం చెయ్యరాదని తన భర్త వేధించాడని, తన భర్తకు ఆయన కుటుంబ సభ్యులు ఇద్దరు మద్దతు ఇచ్చారని ఆరోపిస్తూ బాధితురాలు బెంగళూరు నగరంలోని బసవేశ్వర నగర్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేశారు.

A Women lodges case against her husband for dowry harassment in Basaweshwarnagar police station, Bengaluru.

బెంగళూరులోని మహాగణపతి నగర్ లో మహేష్ అనే యువకుడు నివాసం ఉంటున్నారు. గత సంవత్సరం (2016)లో 25 ఏళ్ల యువతితో మహేష్ వివాహం జరిగింది. పెళ్లి అయిన తరువాత ఆమె మహాగణపతి నగర్ లోని భర్త మహేష్ ఇంటికి వెళ్లారు.

పెళ్లికి ముందు చెప్పినట్లుగా వరకట్నం తీసుకురాకుంటే తనతో సంసారం చెయ్యరాదని, బెడ్ రూంలోకి రాకూడదని మహేష్ భార్యను చిత్రహింసలకు గురి చేశాడని సమాచారం. భార్యతో సంసారం చెయ్యడానికి వెళ్లిన ఆమెను మెడపట్టి బయటకు గెంటేశాడని, మీ ఇంటికి వెళ్లిపోకపోతే చంపేస్తానని మహేష్ బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి.

మహేష్ కు ఆయన కుటుంబ సభ్యులు ఇద్దరు మద్దతు ఇవ్వడంతో అతను ఇంకా రెచ్చిపోయాడని, భర్త వేధింపులు తట్టుకోలేక 2017 జనవరి 23వ తేదిన తను పుట్టింటికి వెళ్లిపోయానని, అయినా తన భర్త వేధిస్తున్నాడని ఆరోపిస్తూ మహేష్, ఆయన కుటుంబ సభ్యులు ఇద్దరి మీద బాధితురాలు బసవేశ్వర నగర పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు అయ్యింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Women lodges case against her husband for dowry harassment in Basaweshwarnagar police station, Bengaluru.
Please Wait while comments are loading...