రేప్: ఏడేళ్ల జైలు శిక్ష, ఢిల్లీలో ఎపి మహిళ హత్య

raped
న్యూఢిల్లీ: పని మనిషిపై అత్యాచారం చేసిన ఓ యువకుడికి కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు 3వేల రూపాయల జరిమానా విధించింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రంలోని మధుబని ప్రాంతానికి చెందిన ప్రమోద్ అనే యువకుడు ఢిల్లీలోని ఓ ఇంట్లో పని చేస్తున్నాడు. కాగా అదే ఇంట్లో పని మనిషిగా ఉన్న మహిళపై 2010 అక్టోబర్ నెలలో అత్యాచారానికి పాల్పడ్డాడు.

పోలీసులు నిందితున్ని కోర్టులో ప్రవేశపెట్టగా అతనికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను కోర్టు విధించింది. ప్రమోద్ ఆర్థిక పరిస్థితి కారణంగా బాధితురాలికి తగినంత నష్టపరిహారం చెల్లించలేడు కాబట్టి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని అంశాల ప్రకారం తగిన పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఘటన జరిగిన అనంతరం నిందితుడు పరారు కావడంతో అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేయడం జరిగింది.

ఏపికి చెందిన మహిళ దారుణ హత్య

దక్షిణ ఢిల్లీలోని సరోజిని‌నగర్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ దారుణ హత్యకు గురైంది. సరోజిని నగర్‌లోని తన నివాసంలో మంగళవారం సాయంత్రం శరీరంపై గాయాలతో, గొంతు కోయబడి శవంగా పడి ఉంది. మృతురాలిని సన్యుక్తగా పోలీసులు గుర్తించారు. మృతురాలికి చేతికి ఉంగరాలు, ల్యాప్ టాప్ అలాగే ఉండడం వల్ల ఇది దోపిడీదారుల పని కాదని పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు, ఫోరెన్సిక్ నిపుణులు వేలు ముద్రలు సేకరించనున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కిశోర్ కుమార్, సంయుక్త ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు. ఆర్మీ హెడ్ కానిస్టేబుల్ అయిన కిశోర్ కుమార్ సేనా భవన్ దగ్గర విధులు నిర్వహిస్తున్నాడు. ఈ దంపతులిద్దరూ ప్రభుత్వ వసతి గృహంలోనే నివాసముంటున్నారు.

మంగళవారం సాయంత్రం 6.15గంటలకు ఎం బ్లాక్ ప్రాంతంలోని తన నివాసం ఇంటి నెం. 157లో సన్యుక్త హత్యకు గురైనట్లు తెలుస్తోంది. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన కిశోర్ తన భార్య సంయుక్త హత్యకు గురైనట్లు గుర్తించాడు. తను ఇంటికి వెళ్లే సరికి తలుపులు సగం వరకే మూసి ఉన్నాయని, లోనికి వెళ్లగా సంయుక్త రక్తపు మడుగులో ఉన్నట్లు కిశోర్ తెలిపాడు.

వెంటనే ఆస్పత్రికి తరలించామని, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారని కిశోర్ చెప్పాడు. హత్య కేసు నమోదు చేశామని, కేసు విషయంలో కొంతమందిని విచారించి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+