పెళ్లి జరిగిన రెండు నెలలకే ఫ్లైఓవర్ మీదకు వెళ్లాడు. కరెంట్ ఆఫీసులో ఉద్యోగం, ఏం జరిగింది !
వివాహం చేసుకున్న రెండు నెలలకే ఓ యువకుడు ఎవ్వరూ ఊహించిన నిర్ణయం తీసుకున్నాడు. బెంగళూరులోని నాయండహళ్లి ఫ్లై ఓవర్‌పై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువకుడు ఫ్లైఓవర్‌పై బైక్‌ను ఆపిన తరువాత అటూ ఇటూ తిరిగి అందరూ చూస్తున్న సమయంలో హఠాత్తుగా పై నుంచి కిందకు దూకేశాడు. యువకుడి ప్రాణాలు కాపాడటానికి పోలీసులు అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండాపోయింది.
బెంగళూరులోని బ్యాటరాయణపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫైఓవర్ పై నుంచి దూకిన యువకుడిని వెంటనే ట్రాఫిక్ పోలీసులు రక్షించి చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని వైద్యులు తెలిపారు. నవీన్ (32) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. బెంగళూరు నగరంలోని కేపీటీసీఎల్ (కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్)లో నవీన్ పనిచేస్తున్నాడు.

నవీన్ అతని ఎలక్ట్రిక్ బైక్ తీసుకుని అతని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. తరువాత నాయండహళ్లి ఫ్లైఓవర్ మీదకు వెళ్లి అక్కడే బైక్ నిలిపాడు. తరువాత ఒక నిమిషం పాటు అటూఇటూ తిరిగిన నవీన్ అదే ఫ్లైఓవర్ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. నవీన్ వివరాలు తెలుసుకున్న పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బెంగళూరులోని బ్యాటరాయణపుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
నవీన్‌కు రెండు నెలల క్రితం కవిత అనే యువతితో వివాహమైందని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. కేపీటీసీఎల్ లో నవీన్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నాడు. ఉద్యోగానికి బయలుదేరిన నవీన్ తరువాత మార్గం మధ్యలోనే ఫ్లైఓవర్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. నవీన్ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు అన్నారు.

నవీన్ పని చేస్తున్న సంస్థ డిప్యూటీ మేనేజర్ మంజునాథ్ మాట్లాడుతూ నవీన్ మంచి యువకుడని, అతను నాకు సహాయకుడిగా పనిచేస్తున్నాడని తెలిపారు. ఉదయం విధులకు రాకపోవడంతో నవీన్ మొబైల్ నంబర్‌కు ఫోన్ చేయగా ఆ ఫోన్ కాల్‌ని అందుకున్న పోలీసులు అతను ఆత్మహత్యకు పాల్పడ్డారని సమాచారం ఇవ్వడంతో తాను ఒక్క క్షణం షాక్ అయ్యానని ఆయన చెప్పారు. కొద్దికాలం క్రితమే నవీన్ మా కంపెనీలో చేరానని వివరించాడు. కేసు విచారణలో ఉంది.












Click it and Unblock the Notifications