అక్రమ సంబంధాలు, ఒకరు ఏం చేశారు ?, ఇంకో కిలాడీ లేడీ ఏం చేసిందంటే ? కామం కోసం !
మొదటి సంతానం ఆడపిల్ల కాగా, రెండో సంతానం కూడా ఆడపిల్ల కావడంతో మనస్తాపం చెందిన భర్త అప్పుడే పుట్టిన పసికందును అమ్మేందుకు యత్నించిన ఘటన కర్ణాటకలోని హవేరిలో చోటుచేసుకుంది. భర్త చేష్టలతో విసిగిపోయిన బాలింత హవేరి నగరంలోని గాంధీ సర్కిల్‌లోని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు అంబులెన్స్ లో రావడం హాట్ టాపిక్ అయ్యింది.
అప్పుడే పుట్టిన ఆడబిడ్డను అమ్మేందుకు తన భర్త సిందలింగప్ప ప్రయత్నించాడని అతని భార్య గీతా తీవ్ర ఆరోపణలు చేసింది. ఆస్పత్రి నుంచి నేరుగా అంబులెన్స్‌లో ఎస్పీ కార్యాలయానికి వచ్చిన భార్య గీతా తనకు పుట్టిన అమ్మాయిని తన భర్త సిద్దలింగప్ప కిడ్నాప్ చేశాడని ఆరోపించింది. మొదటి సంతానం ఆడపిల్ల కాగా రెండో సంతానం కూడా ఆడపిల్ల కావడంతో తన భర్త చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడని, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని గీతా ఎస్పీకి మనవి చేసింది.

నాలుగు రోజుల క్రితం బాడగి తాలూకా ఆసుపత్రిలో కిడ్నాప్‌కు యత్నించారని, భర్త సిద్దలింగప్ప చేతిలో ఉన్న ఆడబిడ్డను తెలిసిన యువకులు కాపాడారన్నారు. రక్షించేందుకు వచ్చిన యువకులు నా కుమార్తెను కిడ్నాప్ చేశారని, అందుకు తన భర్త సిద్దలింగప్ప వాళ్లకు సహకరించాడని గీతా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. నా భర్త తనకు పుట్టిన పిల్లలను కిడ్నాప్ చేసి డబ్బు కోసం వేరే వాళ్లకు అమ్మేందుకు ప్రయత్నించాడని, కొడుకులు లేరనే కోపంతో తన భర్త ఇలా చెయ్యడం లేదని, తన భర్తకు ఇతర మహిళలతో అక్రమ సంబంధం ఉ:ది గీతా ఆరోపించింది. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.
మరో కేసులో అక్రమ సంబంధంతో గర్భవతి అయిన ఓ యువతి తనంతట తానుగా ప్రసవించింది. అలాగే పుట్టిన పురిటి బిడ్డ ఇంటి సమీపంలోని ఓ చోట వదిలేసిందని, ఆ బిడ్డ మృతికి కారణమైందని పోలీసులు తెలిపారు. తుమకూరులోని ఆరెగుజ్జనహళ్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
యువతి ఇంట్లో వదులుగా ఉన్న బట్టలు వేసుకునిని తిరిగింది. అంతకు ముందే ఆమె గర్భం దాల్చినా ఎవ్వూ గుర్తించలేకపోయారని పోలీసులు తెలిపారు.

9 నెలలు కావస్తున్నా ఎవరికీ తెలియకుండా, తాను గర్బవతి అనే విషయం కుటుంబీకులకు తెలియజేయకుండా తనంతట తానుగా ఆ యువతి ప్రసవించింది. పెళ్లికాకుండానే ఆ యువతి అక్రమ సంబందం కారణంగా తల్లి అయ్యింది. తరువాత సమాజానికి భయపడిన ఆమె తనకు పుట్టిన పురిటి బిడ్డను బహిరంగ ప్రదేశంలో విసిరి ఇంటికి వచ్చింది. బిడ్డకు తల్లి అయిన ఆ యువతి వయస్సు 25 సంవత్సరాలు అని పోలీసులు తెలిపారు.
ఆ యువతి గౌరీపూర్ గ్రామానికి చెందినదని, తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె తన అక్క ఇంట్లో ఆశ్రయం పొందిందని పోలీసులు తెలిపారు. రాత్రి 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె ప్రసవించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
గ్రామం నుంచి బయటకు వెళ్లిన ఆ యువతి చిన్నారిని పక్కన పడేసి ఇంటికి వెళ్లి స్నానం చేసింది. ఉదయం కూలి పనులకు వెళ్తున్న గ్రామస్థులకు అప్పుడే పుట్టిన ఆడశిశువు మృతదేహం కనిపించింది. గ్రామస్తులు వెంటనే పోలీసులకు, బాలల సంరక్షణ విభాగానికి, ఆరోగ్య శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. యువతిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తుమకూరు జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications