బాయ్ ఫ్రెండ్ తో యువతి పెళ్లి ఫిక్స్, ఇంతలో బెడ్ రూమ్ లోకి వెళ్లిన యువతి, అందరూ షాక్

యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. అందరు ప్రేమికుల్లా ఆ జంట కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. అన్ని ప్రేమకథల్లాగే ప్రేమికుల ఇద్దరి కులాలు వేరు. అయినా ప్రియుడితో పెళ్లికి ఆ యువతి సిద్దం అయ్యింది. పెళ్లికి మొదట ప్రియుడి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తరువాత ప్రియురాలి తల్లి కూడా పెళ్లికి అంగీకరించింది. అయితే పెళ్లి డేట్ దగ్గర పడుతున్న సమయంలో పెళ్లికూతురు ఆత్మహత్య చేసుకుంది.

ప్రేమించిన యువకుడినే పెళ్లి చేసుకుంటున్న ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హర్యానాలోని కర్నాల్‌లో జరగడంతో పెళ్లి వేడుకలు జరగాల్సిన ఇంటిలో విషాదచాయలు నెలకొన్నాయి. ప్రేమ వివాహం కావడంతో మొదట యువతి తండ్రి ఈ పెళ్లికి అంగీకరించలేదు. అయితే పెళ్లి తేదీ ఫిక్స్ అయింది. తల్లిదండ్రులు పెళ్లికి పూర్తిగా అంగీకరించకపోవడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

A young woman who was ready to marry her boyfriend committed suicide

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.ఈ సంఘటన కర్నాల్ సెక్టార్ 32లో జరిగింది, సుమన్ జగ్గీ అలియాస్ సుమన్ (19) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. సుమన్ జోపాడిలో నివసిస్తోంది. సుమన్ నివాసం ఉంటున్న ప్రాంతం సమీపంలోనే ఉండే రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడితో ప్రేమలో పడింది.

సుమన్ తల్లి ఇద్దరి పెళ్లికి అంగీకరించింది. ఇదే సమయంలో కూతురు సుమన్ పెళ్లికి ఆమె సర్వం సిద్దం చేస్తోంది. రాకేష్ వేరే కులానికి చెందిన వ్యక్తి కావడంతో సుమన్ తండ్రి పెళ్లికి అంగీకరించలేదు. పెళ్లి విషయంలో తండ్రీకూతుళ్ల మధ్య గొడవ జరిగింది. గొడవలో కూతురు సుమన్ పై తండ్రి దాడి చేశాడు. దీంతో సుమన్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాకేష్ తల్లి స్పందించింది.

ప్రేమకు ఒప్పుకోకపోతే పిల్లలు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారనే భయం ఉండేది. అందుకే పెళ్లికి ఒప్పుకున్నామని, గత రాత్రి సుమన్ నాకు అర్థరాత్రి ఫోన్ చేసిందని, ఆమె తండ్రి ఆమెపై దాడి చేసి బెదిరించేవాడని ఆమె తనతో చెప్పి బోరున విలపించిందని రాకేతష్ తల్లి చెప్పింది, పెళ్లికి మేము కట్నం కూడా అడగలేదని ఆమె పోలీసులకు చెప్పారు. తన తండ్రి ఆయనకు తెలిసిన వాళ్లను పిలిపించి తమను చంపేస్తారని బెదిరించాడని సుమన్ ను పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయిన రాకేష్ తో పాటు అతని కుటుంబం ఆరోపించింది. అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+