ఆసక్తికరం: '80 వేల మందిని ఆధార్ కార్డ్ పట్టించింది'

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తమ అనుబంధ కళాశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు, చదువుకునే విద్యార్ధులు తప్పనిసరిగా ఆధార్‌ను సమర్పించాలని విశ్వవిద్యాలయ నిర్వాహకులు కోరారు. దీంతో వారంతా తమ ఆధార్‌ను ఇచ్చారు. ఈ ఆధార్‌ సమర్పణ ద్వారా షాకింగ్ వాస్తవాలు వెలుగు చూశాయి.

సుమారు 80వేల మంది ఉపాధ్యాయులు ఒకటి కంటే ఎక్కువ చోట్ల పని చేస్తున్నట్లు తేలింది. డూప్లికేషన్‌ను తగ్గించాలన్న పథకంతో కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలకు తమ ఆధీనంలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహస్తోన్న, చదువుతోన్న విద్యార్థుల ఆధార్‌ను తీసుకోవల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

Aadhaar helped identify 80,000 ghost teachers in higher education institutions

దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ ఆధార్‌ను ఇచ్చారు. సుమారు 80 వేల మంది ఉపాధ్యాయులు ఒకటి కంటే ఎక్కువ చోట్ల విధులు నిర్వహస్తున్నట్లు తేలింది. వీరిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని హెచ్‌ఆర్‌డీ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ చెప్పారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పని చేసేవారు ఎవరూ ఈ జాబితాలో లేరని, రాష్ట్రాలకు సంబంధించిన విశ్వవిద్యాలయాల్లో ఎక్కువ మంది ఉన్నారని మంత్రి చెప్పారు.

ఆధార్‌ను సమర్పించేందుకు అపోహల కారణంగా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, మీ మొబైల్‌ నంబర్‌ ఎలా ఇతరులతో పంచుకుంటున్నారో ఇదీ అంతేనని, ఆధార్‌ నంబర్‌ ఇస్తే మీ వ్యక్తిగత సమాచారం అంతా తెలుస్తోందన్నది అపోహ మాత్రమేనని, ఇలాంటివి నమ్మవద్దని ఆయన చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A major scam has come to light, with mandatory Aadhaar disclosure revealing that over 80,000 teachers are faculty members of three or more institutions of higher education.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి