ఏఏపీలో షాక్: కార్యకర్త వేధింపు, మహిళా కార్యకర్త ఆత్మహత్య

Posted By:
Subscribe to Oneindia Telugu

ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో తనతో పాటు పని చేసే ఓ కార్యకర్త వేధింపులు భరించలేక ఓ మహిళా కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని నెరెల ప్రాంతంలో మంగళవారం నాడు మహిళా కార్యకర్త ఆత్మహత్య చేసుకుంది.

తనను వేధింపులకు గురి చేసిన వ్యక్తి స్వేచ్ఛగా బెయిల్ పైన విడుదల కావడంతో మానసికంగా కుంగిపోయిన తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

AAP Activist, Who Accused Party

తనను తోటి కార్యకర్త వేధిస్తున్నాడని మృతి చెందిన మహిళ గత జూన్ నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అనంతరం అతను బెయిల్ పైన విడుదలయ్యాడు. వేధింపులకు పాల్పడిన వ్యక్తికి స్థానిక ఎమ్మెల్యే మద్దతు ఉందని, అతడు విడుదల కావడంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుందని చెబుతున్నారు.

ఈ ఘటనలో ఏఏపీ పార్టీ పైన భారతీయ జనతా పార్టీ విమర్శలు కురిపించింది. ఏఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, వారి సమస్యలను పట్టించుకోవడం లేదని చెప్పింది. బీజేపీ విమర్శలను ఏఏపీ కొట్టి పారేసింది. కార్యకర్త హత్యను రాజకీయం చేస్తున్నారని విమర్శించింది. కాగా, ఈ హత్యపై మెజెస్ట్రియల్ విచారణకు ఆదేశించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman activist of the Aam Aadmi Party (AAP) in Delhi, who had accused her party colleague of sexually harassing her, committed suicide on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి