వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేం పోటీచేయం, కాని, బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం, ఎవరికి లాభం?

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా పోటీచేయాలని ఆప్ నిర్ణయించింది. గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే తాము ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తా

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో :ఉత్దర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోమని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. అయితే ఈ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. పంజాబ్, గోవా ఎన్నికల తర్వాత ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లోనే క్రియాశీలకంగా ప్రచారం చేయనున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది.

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి ఏడు విడతలుగా ఎన్నికలను నిర్వహించనున్నారు.ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.

ఈ ఎన్నికల్లో కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర రాష్ట్రాల్లో పోటీచేస్తోంది. పంజాబ్ లో ఆ పార్టీ ప్రధానంగా కేంద్రీకరించనుంది. అయితే ఈ పార్టీ బిజెపిని ప్రధాన శత్రువగా భావిస్తోంది. దరిమిలా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేయనుంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ చేసే ప్రచారం ఏ పార్టీకి కలిసివస్తోందో చూడాలి. అయితే ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలో ఆప్ పోటీచేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకొంటోంది. అయితే వ్యూహాత్మకంగా యూపిలో మాత్రం పోటీకి దూరంగా ఉంటోంది.

 ఉత్తర్ ప్రదేశ్ లో బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం

ఉత్తర్ ప్రదేశ్ లో బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోని అధికార బిజెపితో ఆ పార్టీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. లెప్టినెంట్ గవర్నర్ ను అడ్డంపెట్టుకొని తమ ప్రభుత్వాన్ని కేంద్రం ఇబ్బందిపెడుతోందని ఆప్ పలు విమర్శలు చేసింది. బిజెపికి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఆ పార్టీ ముందు వరుసలో నిలిచింది. ఈ తరుణంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా పనిచేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. అయితే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బిజెపికి వ్యతిరేకంగా ఆ పార్టీ విస్తృతంగా ప్రచారం చేయనుంది.

 'ఆప్ ' ప్రచారం బిజెపి యేతర పార్టీలకు లాభమా ?

'ఆప్ ' ప్రచారం బిజెపి యేతర పార్టీలకు లాభమా ?

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో 400 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది.అయితే ఆ పార్టీలో నెలకొన్న సంక్షోభం ఈ ఎన్నికల్లో ఆ పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు బిఎస్ పి , కాంగ్రెస్ పార్టీలు కూడ ఈ ఎన్నికల్లో రంగంలో ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకొనే అవకాశాలు కూడ లేకపోలేదనే వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆప్ బిజెపికి వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో చేసే ప్రచారం ఏ పార్టీకి ప్రయోజనం కల్గిస్తోందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరో వైపు ఆప్ ప్రత్యేకించి ఏ పార్టీకైనా మద్దతు పలుకుతోందా అనే విషయమై ఇప్పటికైతే ప్రకటించలేదు.

 యూపిలో త్రిముఖ పోటీ జరిగే అవకాశం

యూపిలో త్రిముఖ పోటీ జరిగే అవకాశం

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా త్రిముఖ పోటీ జరిగే అవకాశం ఉంది. సమాజ్ వాదీ , బిఎస్ పి, బిజెపి ల మధ్యే ప్రధాన పోటీ జరగనుంది.అయితే ఈ సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభం నామినేష్లన్ల ఉపసంహరణ నాటికి కూడ సమసిపోకపోతే ఆ పార్టీకి కొంత నష్టం జరిగే అవకాశం లేకపోలేదు.అయితే ములాయం సింగ్ యాదవ్ వైపు తక్కువ మందే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీచేసే పరిస్థితులు అంతగా అనుకూలించే పరిస్థితులు కన్పించడంలేదు. అఖిలేష్ కాంగ్రెస్ పార్టీతొ పొత్తుకు సై అంటున్నాడు . కాని, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం విముఖత చూపుతున్నారు. బిఎస్ పి , బిజెపిలు కూడ స్వతహగానే పోటీచేయనున్నాయి.

 ఎన్నికల కమీషన్ వద్ద బల ప్రదర్శనకు ములాయం, అఖిలేష్

ఎన్నికల కమీషన్ వద్ద బల ప్రదర్శనకు ములాయం, అఖిలేష్

ఎన్నికల గుర్తు కోసం ఈ నెల 9వ, తేదిలోపుగా తమ బలాన్ని నిరూపించుకొనే అఫిడవిట్లను సమర్పించాలని కేంద్ర ఎన్నికల కమీషన్ సమాజ్ వాదీ పార్టీకి చెందిన రెండు గ్రూపుల నాయకులు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ లను కోరింది. తనను సమర్థించే నాయకులకు చెందిన అఫిడవిట్లతో అఖిలేష్ వర్గం ఈ నెల 7వ, తేదినే ఎన్నికల కమీషన్ కు అఫిడవిట్లను సమర్పించింది. మరో వైపు ములాయం సింగ్ యాదవ్ కూడ తన బలాన్ని ఎన్నికల కమీషన్ ముందుకు ప్రదర్శించనున్నారు.అయితే ప్రస్తుతం యూపి అసెంబ్లీలో ఉన్న సిట్టింగ్ ఎంఏల్ఏలు, ఎం ఏల్ సి లతో పాటు, పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులంతా అఖిలేష్ కు మద్దతిస్తున్నారు. ములాయం ను పరిమిత సంఖ్యలో మాత్రమే మద్దతు పలుకుతున్నారు. ఎన్నికల కమీషన్ ఎవరివైపు మొగ్గుచూపుతోందో చూడాలి.

English summary
aap to campaign against bjp in uttarpradesh elections, not to contest in polls said aap leaders, after punjab, goa elections aap leaders will concertrate on uttarpradesh elections to expose bjp said aap spokes person vaibhav maheshwari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X