వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్ హత్యకు కుట్ర..!!

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ అన్ని పార్టీలు కూడా తమ ప్రచార జోరును పెంచుకుంటోన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడం వల్ల- అందరి దృష్టీ ఈ ఎన్నికలపైనే నిలిచింది. ఫలితాలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠభరితంగా మారింది. రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ప్రభావం ఎంతమేర ఉందనేది ఈ ఎన్నికలు స్పష్టం చేయనున్నాయి.

హోరాహోరీగా..

హోరాహోరీగా..

అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ దీనికి ఏ మాత్రం తీసిపోని విధంగా ప్రచార ఉధృతిని కొనసాగిస్తోన్నాయి. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1వ తేదీన 89 సీట్లు, 5వ తేదీన మిగిలిన 93 స్థానాలకు పోలింగ్‌ను షెడ్యూల్ చేసింది.

త్రిముఖ పోరు..

మొత్తం 4,90,89,765 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అదే నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తన వంతు ప్రయత్నాలు గట్టిగానే సాగిస్తోంది. బీజేపీకి ఇదివరకట్లా గెలుపు నల్లేరు మీద నడక కాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. మరోసారి అధికారాన్ని అందుకోవడానికి శ్రమించక తప్పదనే విశ్లేషణ

త్రిముఖ పోరు..

త్రిముఖ పోరు..

మొత్తం 4,90,89,765 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అదే నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తన వంతు ప్రయత్నాలు గట్టిగానే సాగిస్తోంది. బీజేపీకి ఇదివరకట్లా గెలుపు నల్లేరు మీద నడక కాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. మరోసారి అధికారాన్ని అందుకోవడానికి శ్రమించక తప్పదనే విశ్లేషణలూ ఉన్నాయి.

సంచలన ఆరోపణ..

సంచలన ఆరోపణ..

ఈ పరిణామాల మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా.. సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే బీజేపీ నాయకులు కుట్రకు పన్నుతున్నారని ఆరోపించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూడా బీజేపీ ఘోర పరాభవం తప్పదని ఆయన జోస్యం చెప్పారు.

ఫ్రస్ట్రేషన్‌లో కమలం..

గుజరాత్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పరాజయాలపాలవుతామనే ఆందోళనతో బీజేపీ నాయకులు తీవ్రంగా ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారని మనీష్ సిసోడియా పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ఓ ట్వీట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌పై దాడులు చేయాలంటూ బీజేపీ లోక్‌సభ సభ్యుడు మనోజ్ తివారీ బాహటంగానే తన అనుచరులు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తోన్నారంటూ మండిపడ్డారు. వారి బెదిరింపులకు తాము భయపడట్లేదని, ఈ రెండు ఎన్నికల్లోనూ ప్రజలే వారికి బుద్ధి చెబుతారని అన్నారు.

తిప్పి కొట్టిన మనోజ్..

తిప్పి కొట్టిన మనోజ్..

ఈ ఆరోపణలను మనోజ్ తివారీ తిప్పి కొట్టారు. కేజ్రీవాల్ భద్రత పట్ల తాను ఆందోళనకు గురవుతున్నానంటూ ఎద్దేవా చేశారు. అవినీతి కూపంలో చిక్కుకుపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజలే కాదు.. ఆ పార్టీ కార్యకర్తలు కూడా విరక్తి చెందారని విమర్శించారు. టికెట్లను అమ్ముకున్న ఆప్ నాయకులపై దాడులు చేయడానికి సొంత పార్టీ కార్యకర్తలే సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపైనా దాడి జరిగిందని గుర్తు చేశారు. అలాంటి దాడి కేజ్రీవాల్‌పై జరక్కూడదని కోరుకుంటున్నట్లు చురకలు అంటించారు.

English summary
Aam Aadmi Party has alleged the BJP has been conspiring to kill the Delhi CM Arvind Kejriwal due to fearing its defeat in the upcoming MCD and Gujarat Assembly polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X