
రూ.1400 కోట్ల స్కాం: నిషేధించిన నోట్లను మార్చారు.. ఎల్జీపై ఆప్ ఎమ్మెల్యేలు
ఢిల్లీలో లెప్టినెంట్ గవర్నర్ వర్సెస్ ఆప్ ప్రభుత్వం మధ్య రగడ కంటిన్యూ అవుతూనే ఉంది. ఏదో ఇష్యూతో గొడవ ఉంటూనే ఉంది. ఇటీవల వెలుగుచూసిన లిక్కర్ స్కాం పెద్ద దుమారమే రేపింది. దానికి ఆప్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. తాజాగా ఎల్జీపై ఆప్ ఎమ్మెల్యేలు అవినీతి ఆరోపణలు చేశారు. ఇప్పటి ఎల్జీ వీకే సక్సేనా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్‌గా ఉన్న సమయంలో రూ.1400 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. నిషేధించిన కరెన్సీ నోట్లను మార్చారని వారు చెప్పారు. దానిపై విచారణ జరిపించాలని వారు అసెంబలీ బయట ఆందోళనకు దిగారు.
2016 నవంబర్‌లో పెద్ద నోట్లు రద్దయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఖాదీ చైర్మన్‌గా ఉన్న సక్సేనా.. తన ఉద్యోగులను నోట్లను మార్చాలని ఒత్తిడి చేశారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. దాని విలువ రూ.1400 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. ఎల్జీపై విచారణ జరిపించాలని కోరుతూ.. రాత్రంతా అసెంబ్లీ ఆవరణలో ఆందోళన కొనసాగిస్తామని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.

ఒకరోజు ముందు ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. ఆ సమయంలో పెద్ద నోట్లను ఎలా మారుస్తారని అడిగారు. ఘటనపై విచారణ జరపాలని కోరారు. దీనికి సంబంధించి ఇబ్బంది పడ్డ ఉద్యోగులు బయటకు వచ్చారని తెలిసిందని పేర్కొన్నారు. వీకే సక్సేనాను అరెస్ట్ చేయండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అంతేకాదు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ పోస్ట్ నుంచి తొలగించాలని కోరారు. గతనెలలో మద్యం కేటాయింపులకు సంబంధించి అవనీతి జరిగిందని సీబీఐ విచారణను గవర్నర్ కోరిన సంగతి తెలిసిందే. దీంతో అగ్గిరాజేసింది. ఆ తర్వాత ఆప్ కౌంటర్ అటాక్ చేస్తోంది.